ఎన్డీయే మీటింగ్..పవన్‌కు ఆహ్వానం..టీడీపీ పొజిషన్ ఏంటి?

కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఐక్యంగా ఉంటూ బి‌జే‌పిని గద్దె దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇటీవల పాట్నాలో కాంగ్రెస్ తో సహ విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి విభేదాలు లేకుండా విపక్షాలు కలిసికట్టుగా పనిచేసి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని భావిస్తున్నారు. ఇక విపక్షాలకు మళ్ళీ చెక్ పెట్టి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది.

ఈ క్రమంలో బి‌జే‌పి సైతం..తమ మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లో పలు మిత్రపక్షాలని కలుపుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ తర్వాత చాలా పార్టీలు బి‌జే‌పికి దూరమయ్యాయి. పైగా సొంత మెజారిటీతో అధికారంలోకి వస్తుండటంతో బి‌జే‌పి..మిత్రపక్షాలని లైట్ తీసుకుంది. కానీ ఇప్పుడు విపక్షాలు బలపడుతుండటంతో బి‌జే‌పి సైతం అలెర్ట్ అయ్యి..ఈ నెల 18న తమ మిత్రపక్షాలతో మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఎన్డీయేలో ఉన్న ప్రతి మిత్రపక్షానికి ఆహ్వానం పలికింది.

ఇదే క్రమంలో ఏపీలో బి‌జే‌పితో పొత్తులో ఉన్న జనసేనకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలిసింది. దీంతో సమావేశానికి పవన్ హాజరవుతారని ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్డీయే మీటింగ్‌కు టి‌డి‌పికి ఆహ్వానం ఇచ్చారని ఆ మధ్య ప్రచారం జరిగింది గాని, అందులో ఎలాంటి వాస్తవంలేదని అటు టి‌డి‌పి, ఇటు బి‌జే‌పిలు తేల్చి చెప్పేసాయి.

అదే సమయంలోల్ బి‌జే‌పి తమని పిలవకపోవడమే మంచిదని టి‌డి‌పి శ్రేణులు అంటున్నాయి. ఇక సమావేశానికి పవన్ హాజరవుతారా? లేదా? అనేది క్లారిటీ లేదు. అలాగే టి‌డి‌పి-జనసేన కలవాలని అనుకుంటున్నాయి. వీరితో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది నెక్స్ట్ అంశం.  చూడాలి మరి పొత్తుల విషయంలో ఏం జరుగుతుందో.