డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ సింగర్ గా నటిగా ఇప్పుడిప్పుడే తన కెరియర్ నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. అదితి కూడా ఇటీవలే MBBS కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతిది సినిమాలోకి వస్తా అన్నప్పుడు హీరోయిన్ అవుతా అన్నప్పుడు డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమె శివ కార్తికేయన్ సరసన అతిధి శంకర్ హీరోయిన్గా నటించిన మహావీరుడు సినిమా రిలీజ్ కోసం అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతిధి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తన తండ్రి ఒక పెద్ద డైరెక్టర్ అవ్వడంతో చిన్నప్పటినుంచి సినిమాలు మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయిందని అందుకే హీరోయిన్ అవ్వాలని ఎప్పటినుంచో ఉన్న MBBS చదువును కూడా పూర్తి చేసి చివరిలో హీరోయిన్ కావాలని ఉందని తన తండ్రికి చెప్పిందట మొదట తన తండ్రి నో అని చెప్పిన ఆ తర్వాత పేరు వాడుకోకుండా సినిమాల కోసం ట్రై చేయి అంటూ సలహా ఇచ్చారట.
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అంటే అంత తేలిక కాదు ఒక ఏడాది పాటు సమయం ఇస్తాను ఆలోపు ఛాన్సులు రాకపోతే ఇంకెప్పుడు తన దగ్గర సినిమాల పేరు ఎత్తకూడదని చెప్పారట ఆ కండిషన్ కి తను ఒప్పుకున్నారని తెలిపింది. MBBS చివరిలో ఉన్నప్పుడే కార్తీ హీరోగా తెరకెక్కించిన వీరుమన్ సినిమాల డైరెక్ట్ హీరోయిన్గా మొదటి సినిమా అవకాశం వచ్చిందట ఇందులో మోడరన్ గా ఉన్న అమ్మాయి పల్లెటూరి పాత్రలు చేసింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.