బేబీ: ఆనంద్ దేవరకొండ సక్సెస్ కొట్టారా..!!

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బేబీ.. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో డైరెక్టర్ కలర్ ఫోటో చిత్రానికి తనే రచయితగా వ్యవహరించారు. అయితే బేబీ సినిమాతో నైనా ఆనంద్ దేవరకొండ కెరియర్ మలుపు తిరిగిందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

కథ విషయానికి వస్తే (వైష్ణవి చైతన్య) బస్తీలో తిరిగి అమ్మాయి ఎదురింటిలో ఉన్న అబ్బాయి (ఆనంద్ దేవరకొండ )ను ప్రేమిస్తూ ఉంటుంది. ఆమెను అతడు కూడా ప్రేమిస్తూ ఉంటారు. అయితే టెన్త్ ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ గా మారుతారు.. వైష్ణవి ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది.. కొత్త పరిచయాల వల్ల వైష్ణవిలో మార్పుకు కారణం అవుతాయి. అక్కడే (విరాజ్ అశ్విన్) కు దగ్గరవుతుంది వైష్ణవి. దీంతో పబ్బుల్లో అతనితో రొమాన్స్ కూడా చేస్తూ ఉంటుంది.

ఈ విషయం ఆనందుకు తెలుస్తుందా లేదా తెలిసిన ఎలా రియాక్ట్ అవుతారు అనే కథ అంశంతో తెరకెక్కించారు. చివరికి ఎవరిని ప్రేమిస్తుంది. అనే విషయం తెలియాలి అంటే వెండితెర పైన చూడాలి. బేబీ సినిమాని చాలా పచ్చిగా తీశారు డైరెక్టర్ సాయి రాజేష్ అనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు స్క్రీన్ మాత్రం అదిరిపోయిందని కొన్ని సన్నివేశాలు సూపర్ గా వర్క్ అవుట్ అయ్యాయని ఫస్ట్ ఆఫ్ నెమ్మదిగా సాగిన సెకండాఫ్ మాత్రం హైలెట్ గా ఉందంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్ చేసిన కూడా సూపర్ గా ఉందని నిజమైన ప్రేమకి బలహీనతకి మధ్య నలిగే పాత్ర ఎంతో అందంగా చూపించాలని తెలియజేస్తున్నారు. వాస్తవానికి బడ్జెట్ పరంగా చిన్న సినిమా అయినప్పటికీ అభిమానుల హైపును మాత్రం భారీగానే పెంచేసింది మరి ఏ మేరకు కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.