గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫార్మ్ చేసింది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అలాగే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఇలియానా.. తరచూ బేబీ బంప్ ఫోటోలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే ఇలియానా ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఎంతటి హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా వివరించిక్కర్లేదు.
అందుకు కారణం లేకపోలేదు. ఇలియానాకు ఇంతవరకు పెళ్లి అవ్వలేదు. దాంతో ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అన్నది అందరి మదిలో ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇలియానా అన్సర్ ఇవ్వకుండా సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తూ పలు ఫోటోలు పంచుకుంది. కానీ, ఆ పిక్స్ లో అతగాడి ముఖం మాత్రం కనిపించలేదు.
తాజాగా మరోసారి భర్త ఫోటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. ఈ పిక్ లో ఓ వ్యక్తి పెట్ డాగ్ తో ఆడుకుంటూ కనిపించారు. కానీ, ముఖం మాత్రం కనిపించకుండా కిందికి దించేశాడు. అతగాడు ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అన్న విషయం స్పష్టమైనా.. అతనెవరు అన్నది మాత్రం క్లారిటీ రాలేదు. అసలెందుకు ఇలియానా ఇలా ప్రియుడి ఫేస్ చూపించకుండా దాగుడుమూతలు ఆడుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. పుట్టబోయే బిడ్డను, భర్తను ఒకేసారి చూపించడానికి ఇలియానా ఇలా సస్పెన్స్ ను కంటిన్యూ చేస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.