ఈ స్టార్ డైరెక్టర్ల అదృష్టం చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే..!

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా డైరెక్టర్ అనేవారు సినిమాలకు వెన్నుముకగా ఉంటారు. సినిమా తెరపైకి రావాలి అంటే దాని వెనుక నటీనటుల కంటే దర్శకుడు కష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్న సినిమా సినిమాకి సరికొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఫెయిల్యూర్ సినిమా తీయని దర్శకులు ఎవరనే విషయం వినగానే ఎక్కువగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది.Happy birthday SS Rajamouli: From Jr NTR to Ram Charan, wishes pour in for  'RRR' director | Telugu Movie News - Times of India

రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి..RRR సినిమా వరకు 13 సినిమాలను తెరకెక్కించారు అందులో ఒక సినిమా కూడా ఫ్లాప్ గా నిలవలేదు. 13 సినిమాలు ఒక సినిమాను మించి మరొక సినిమా సక్సెస్ అయిందని చెప్పవచ్చు.

Anil Ravipudi Says He Wants Salman Khan Or Shah Rukh Khan In The Remake Of  F3ఇక తర్వాత మరొక డైరెక్టర్ అనిల్ రావుపూడి.. ఒకప్పుడు రైటర్ గా పని చేసిన ఈయన కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మారి తన మొదటి సినిమాతోనే సత్తా చాటారు.. ఆ వెంటనే సుప్రీమ్, రాజా ది గ్రేట్, F-2, సరిలేరు నీకెవ్వరు, F-3 వంటి చిత్రాలను తెరకెక్కించారు ఇప్పుడు బాలయ్యతో ఏకంగా భగవంత్ కేసరి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

We will create entire universe for Prabhas film: Nag Ashwin | Entertainment  News,The Indian Express

ఇక మరొక డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఈ డైరెక్టర్ చేసిన సినిమాలు కేవలం రెండే.. అందులో ఒకటి ఎవడే సుబ్రహ్మణ్యం.. మరొక సినిమా మహానటి. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్-K చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.. ఇక వేరే కాకుండా కోలీవుడ్ నుంచి డైరెక్టర్ లోకేష్ కనకరాజు, అట్లీ.. కన్నడ సినీ పరిశ్రమ నుంచి ప్రశాంత్ నీల్ బాలీవుడ్ డైరెక్టర్లలో రాజ్ కుమార్ కి రాణి తదితర దర్శకులు కెరియర్ల ఫ్లాప్ అంటే చవి చూడలేదు.