సమంత మళ్ళీ ప్రేమలో పడిందా.. ఈ పోస్ట్ కు అర్థం అదేనా..?

టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకొని ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.దీంతో వీరిద్దరిపైన పలు చర్చలు కూడా జరిగాయి. ఇక విడాకుల తర్వాత సమంత ,నాగచైతన్య పైన కూడా పలు రూమర్లు వినిపించడం జరిగింది. నాగచైతన్యకు సమంతాకు విడాకుల తర్వాత సరైన సక్సెస్ కూడా పడలేదని చెప్పవచ్చు.

విడాకుల తరువాత సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటోంది సమంత. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సైతం తెలియజేస్తూ బిజీగా ఉంటుంది. ముఖ్యంగా అనేక లవ్ కొటేషన్లు షేర్ చేస్తూ వస్తున్న సమయంలో సమంత తాజాగా ప్రేమ గురించి చేసిన ఒక కొటేషన్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఇందులో మరణం నుంచి మనల్ని ఏది కాపాడలేదు.. కనీసం ప్రేమతో అయిన జీవితాన్ని కాపాడుకోవాలి అని చిలీ రచయిత పాబ్లో నేరుడా చెప్పిన ఒక కొటేషన్ ని ఆమె చేసింది. సమంత ప్రేమలో పడిందని వార్తలని మరింత వైరల్ గా చేశారు.

సమంత విడాకులు అనంతరం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడి కోలుకొని తన లైఫ్ని బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం పలు రకాల చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్న సమంత గురించి ఇలాంటి వార్తలు వస్తున్న సమయంలో అభిమానుల సైతం ఇలాంటి వార్తలను తిరస్కరిస్తున్నారు. మరి కొంతమంది సమంత వ్యవహారాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సమంత ప్రేమలో ఉన్నట్లు ఈ ఒక్క పోస్టులతో తెలియజేయడంతో పలు అభిమానులు సైతం కాస్త ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి సమంత నిజంగానే ప్రేమలో ఉందా లేదా అనే విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.