అత్యధిక కలెక్షన్స్ రాబడుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

దక్షిణాది భారతదేశంలోని నాలుగు చలనచిత్ర పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో తెలుగు తమిళ్ మలయాళం కన్నడ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను సైతం తిరగరాస్తు ఉన్నాయి. గతంలో ఎన్టీ రామారావు, రజనీకాంత్ ,మోహన్లాల్ తదితరులు హీరోల మధ్య పోటీ ఉండేది. ఇప్పట్లో అయితే ప్రభాస్, మహేష్ ,పవన్ కళ్యాణ్ ,యష్ తదితర హీరోల మధ్య దక్షిణాది నుండి వచ్చిన స్టార్ హీరోలు తమ చిత్రాలతో బాలీవుడ్ ఇతర భాషలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సైతం అందుకుంటున్నారు.అలనాటి హీరోయిన్ల విషయానికి వస్తే జయలలిత, శ్రీదేవి వంటి తారలు ఎన్నో భాషలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. దక్షిణాది తరం నుండి నేటితరం హీరోయిన్లలో రూ .50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిత్రాలలో నటిస్తున్నారు.

దక్షిణాది నుండి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మహిళా ప్రధాన చిత్రం ఏది అంటే కీర్తి సురేష్ మహానటి సినిమా అని చెప్పవచ్చు. దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఈ సినిమాలో అత్యుత్తమ ప్రధాన చిత్రంగా 2018లో ఈ సినిమా పలు రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ .83 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. అప్పటికే అగ్ర హీరోయిన్లుగా పేరు పొందిన సమంత, నయనతార, అనుష్క సాధించిన రికార్డులు అన్నిటిని కూడా మహానటి సినిమాతో బ్రేక్ చేసింది కీర్తి సురేష్.

Keerthy Suresh Reveals The Dark Phase Of Her Career

ఇక అనుష్క నటించిన అరుంధతి చిత్రం రూ .70 కోట్లు కలెక్షన్లు చేయగ.. అనుష్క నటించిన మరొక చిత్రం రుద్రమదేవి సినిమా కూడా అదే స్థాయిలో కలెక్షన్లను సాధించింది. భాగమతి కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ .67 కోట్ల రూపాయలను కలెక్షన్ చేసింది.2017లో నయనతార నటించిన కామెడీ థ్రిల్లర్ కొలయావు కోకిల చిత్రం అత్యధిక కలెక్షన్లు నయనతార కెరియర్ లోనే రాబట్టింది దాదాపుగా రూ .63 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది.

కీర్తి సురేష్ మహానటి సినిమా ద్వారా విజయ్ తో సర్కార్ అనే సినిమాతో రూ .240 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాతో కూడా రూ .180 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. ఇక రజనీకాంత్ తో కలిసి అన్నత్తే రూ.100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.