గుడ్ న్యూస్ చెప్పిన జబర్దస్త్ అవినాష్.. త్వరలోనే ప్రమోషన్స్..!!

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ 2021 అక్టోబర్ లో అనుజా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత అతను ఎన్నో షోలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు తాజాగా త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తామిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని ఇద్దరం ముగ్గురం కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ముక్కు అవినాష్.

ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం అవినాష్ అనుజా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. కామెడీ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అవినాష్ కామెడీ స్కిట్ల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించారు. తనదైన కామెడీ పంచులతో మంచి పాపులారిటీ సంపాదించిన తర్వాత బిగ్బాస్ లో నాలుగవ సీజన్లో పాల్గొనడం జరిగింది. బుల్లితెర తో పాటు కొన్ని సినిమాలలో నటించిన జబర్దస్త్ కమెడియన్ వివాహం అనుజా పెళ్ళి చేసుకున్నారు.

వివాహం తర్వాత తన భార్యతో కలిసి పలు రకాల టీవీ షోలలో కూడా పాల్గొనడం జరిగింది ముక్కు అవినాష్. ప్రస్తుతం స్టార్ కమెడియన్ గాని కాకుండా..బుల్లితెరను ఏలుతు యూట్యూబ్ ఛానల్ వేదికగా తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలిపారు. తన భార్య అనూజ ప్రస్తుతం గర్భంతో ఉంది తనకు ఇప్పుడు నాలుగో నెల త్వరలోనే మా ఇంటికి పాపాయి లేదా బాబు రాబోతున్నారు మా పెళ్లి ఏడాదిన్నర అవుతోంది.. అయినప్పటికీ పిల్లల్ని ఎప్పుడు కంటారంటూ పలువురు అభిమానులు అడుగుతున్నారు మేం అమ్మానాన్నలు కాబోతూ ఉండడంతో చాలా హ్యాపీగా ఉందంటూ తెలిపారు. అయితే వైద్యులు చెప్పడంతోని మూడు నెలల వరకు ఎవరికీ చెప్పొద్దని తెలిపామని తెలిపారు.