కన్నడ హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. ఎప్పుడెప్పుడు కాంతారా-2 చిత్రం తెరకెక్కిస్తారా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే రిశాబ్ శెట్టి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.తన పుట్టినరోజున కాంతారా-2 సినిమాకి సంబంధించి అప్డేట్ సైతం తెలియజేస్తారంటూ అభిమానులు ఆశగా ఎదురు చూశారు..కానీ అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది. కానీ తన పుట్టినరోజు ముగిసిన వేడుకలలో రిషబ్ శెట్టి ఎట్టకేలకు కాంతారా-2 సినిమా పైన స్పందించడం జరిగింది.
రిషబ్శెట్టి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని ఇక నుంచి లొకేషన్స్ సెర్చ్, ఆర్టిస్టుల ఎంపిక జరుగుతుందని ఆ తర్వాత సినిమా షూటింగ్ గురించి హింబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటిస్తుందని రిసెబ్ శెట్టి తెలియజేశారు. కాంతారా-2 చిత్రాన్ని ఈ ఏడాది ప్రకటించి వచ్చే ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు రిషబ్ శెట్టి.ఇదే సమయంలో కాంతార సీక్వెల్ పైన వస్తున్న వార్తలని అసలు నమ్మవద్దని పుట్టినరోజు వేడుకల గురించి కూడా తాను మాట్లాడుతూ నేను పట్టణంలో ఉన్నప్పుడు పుట్టినరోజు వేడుకలు అసలు ఆలోచించలేదు కాలేజీ తర్వాత ఎక్కువగా బెంగళూరులో పుట్టిన రోజు జరుపుకునే వాడినని తెలిపారు.
సినిమాలలోకి వచ్చినప్పుడు నా పుట్టిన రోజున పనిచేయాలని ఆలోచన వచ్చింది అయితే ఈసారి అభిమానులను కలవాలనుకున్నాను అలాగే స్నేహితుల కుటుంబ సభ్యుల మేరకే ఈ వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. కాంతారా సినిమా చూసిన తర్వాత చాలామంది ఇంటికి వచ్చి పలకరించారు.. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా తనని కలిసేందుకు ప్రయత్నించిన కుదరడం లేదని ఎంతోమంది మెసేజ్లు కూడా చేశారని తెలిపారు తనని ఇంతగా అభిమానించే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.