ఆ హీరోయిన్ ని వదలని నాగార్జున.. మళ్ళీ రొమాన్స్ కి సై..!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది నటీనటుల కెమిస్ట్రీ అభిమానులకు ఫేవరెట్ గా నిలుస్తూనే ఉంటుంది. అలాంటి జంటలలో నాగార్జున,టబు జంట కూడా ఒకటని చెప్పవచ్చు. వీరిద్దరూ కలిసి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ వీరి కెమిస్ట్రీ మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది .నాగార్జునతో కలిసి టబు నటించిన చిత్రాల విషయానికి వస్తే.. నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడ వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి ఇక సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

Throwback: When Nagarjuna cleared the air on relationship rumors with Tabu:  Nothing to hide | PINKVILLA

ఆ తరువాత బాలీవుడ్కు వైపుకు వెళ్లి పలు చిత్రాలలో నటించి అక్కడ మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం టబు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమాతో తెలుగులోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఇప్పుడు మరొకసారి నాగార్జునతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తో కలిసి ఒక సినిమాని నాగార్జున తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.ఇందులో నాగార్జునకు జోడిగా టబు నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరొకసారి ఈ రొమాంటిక్ పేరు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి అజయ్ భూపతి ప్రస్తుతం పాయల్ రాజుతో కలిసి మంగళవారం అని ఒక హర్రర్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నాగార్జునతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు కథ చెప్పగా నచ్చడంతో త్వరలోనే టబుకు కూడా కథ వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా పైన అఫీషియల్ గా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.