పవన్‌తో స్నేహం చేయడం వల్ల త్రివిక్రమ్ ఎన్ని కోట్ల లాభం పొందాడో తెలుసా .

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్నంతమంది ఫాన్స్ మరే హీరోకి లేరనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఉన్న స్నేహితులు, సన్నిహితులు చాలా తక్కువ మంది. పవన్ కి ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వాళ్లలో కమెడియన్ అలీ, డైరెక్టర్ త్రివిక్రమ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అయితే ఈమధ్య జరిగిన కొన్ని సంఘటన వల్ల పవన్ కళ్యాణ్ కి,అలికి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది.


దాంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పక్కన త్రివిక్రమ్ తప్ప మరెవరు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇస్తాను అని చెప్పుకొని తిరిగే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ఈ మధ్య సైలెంట్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు కావడంతో , విరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమా లు కూడా వచ్చాయి. జల్సా,  అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమా లు వీరి కాంబో లో వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించే అన్ని సినిమాకు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయటకపోయినా కొన్ని సినిమా లో మాత్రం త్రివిక్రమ్ హస్తం ఉంటుంది. పవన్ కళ్యాణ్ చివరిగా నటించిన భీమ్లా నాయక్ సినిమాకి సాగర్ కె .చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ అతను టైటిల్స్ వరకే పరిమితం అయ్యాడు.

డైలాగ్స్,  స్క్రీన్ ప్లే, ప్రాజెక్ట్ సెట్ చేయడం అంత త్రివిక్రమ్ చేతుల మీదుగా జరిగింది. ఇక ఇప్పుడు బ్రో సినిమా విషయంలో కూడా  త్రివిక్రమ్ హస్తం ఉందని తెలుస్తుంది. పేరుకేమో ఈ సినిమా దర్శకుడు సముద్రఖని. అసలు పవన్ ఎవరితో సినిమా చేయాలి? అందులో ఏ హీరోయిన్ ఉండాలి? లాంటి ముఖ్యమైన నిర్ణయాలు అన్ని త్రివిక్రమే నిర్ణయిస్తాడట
. ఇలా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అయినందుకు త్రీవిక్రమ్ ఒక్కో సినిమాకిగాను 15 నుండి 20 కోట్ల వరకు తీసుకుంటాడని తెలుస్తుంది. ఇక అతను డైరెక్ట్ చేసే సినిమాలకైతే 50 కోట్లు పారితోషికంతో పాటు లాభనష్టాల్లో వాటాలు వంటివి కూడా తీసుకుంటాడట. ఎలా అయితేనేం పవన్ కళ్యాణ్ తో స్నేహం త్రివిక్రమ్ కి భారీగా కలిసి వస్తుందని చెప్పాలి.