`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు.

‘ప్రాజెక్ట్ కె’కు మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ను లాక్ చేసిన‌ట్లు చిత్ర టీమ్ ప్ర‌క‌టించింది. గ్లింప్స్ ద్వారా ఈ అఫీషియల్ టైటిల్‍ను ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో ఈ గ్లింప్స్ రిలీజ్ అవ్వ‌గా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పాత్ర క‌ల్కి భ‌గ‌వాన్‌ను పోలి ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే తాజాగా కామిక్ కాన్ ఈవెంట్‍ కు చిత్ర టీమ్ తో క‌లిసి పాల్గొన్న‌ ప్ర‌భాస్ క‌ల్కిలో త‌న పాత్ర ఎలా ఉంటుందో చెప్పేశాడు. ఫ్లోలో డార్లింగ్ పెద్ద లీకే ఇచ్చాడు. ప్ర‌భాస్ మాట్లాడుతూ.. `ఈ మూవీలో నా క్యారెక్టర్ సూపర్ హీరో. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నా రోల్ కాస్త ఫన్నీగా కూడా ఉంటుంది. నా క్యారెక్టర్‌ను నాగీ డిజైన్ చేసిన తీరు నాకు బాగా క‌నెక్ట్ అయింది. ప్రాజెక్ట్ కె మొత్తంలో నేనొక్కడినే కమెడియన్. ఇక ఎమోషన్స్ చిత్రీకరించడంలో నాగీ స్పెష‌లిస్ట్‌. ఇందులో ఎమోష‌న్స్ చాలా బ‌లంగా ఉంటాయి` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ప్ర‌భాస్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.