ఆ విషయంలో మాట మార్చిన బాలకృష్ణ.. ఆందోళనలో ఫ్యాన్స్..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘ భగవంతు కేసరి’ సినిమా చివరి దశకు వచ్చేసింది. దాంతో బాలయ్య తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టాడు. చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ని అందించిన బాబి, బాలయ్యకు ఒక కథ వినిపించాడట. ఆ కథ బాలకృష్ణ కి కూడా బాగా నచ్చడంతో ఒకే చేపినట్లు తెలుస్తుంది. దాంతో త్వరలోనే ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

నిజానికి బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా తరువాత బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో నటించాల్సి ఉంది. ఆ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో నెక్స్ట్ వచ్చే ఎన్నికలలోపు రిలీజ్ అవుతుందని, ఆ సినిమాలోని పవర్ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోతాయని ప్రచారం జరిగింది. కానీ దానికి రివర్స్ లో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ని పక్కన పెట్టేసి బాబీని లైన్ లోకి తీసుకోవడం బాలయ్య అభిమానులకు కూడా షాకింగ్ గా ఉంది. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణ మంచి పొలిటికల్ కథను పక్కనపెట్టి బాబీ చెప్పిన కథకు ఎందుకు ఓకే చెప్పాడు అంటూ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఈ సంవత్సరం నవంబరులో కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ వస్తాయని సమాచారం. అయితే బోయపాటి శ్రీను మాత్రం ఇంకా రామ్ మూవీ ప్రాజెక్ట్ నుండి బయటకి రాలేదు. ఈ సమయంలో బోయపాటిని కంగారు పెట్టి పొలిటికల్ మూవీ ని స్టార్ట్ చేసినా కూడా ఆది వచ్చే ఎన్నికలోగా పూర్తి కావడం కష్టం. ఒకవేళ నిజంగానే ఎన్నికల్లోపు సినిమా పూర్తికాకపోతే అసలుకే మోసం వస్తుందని ఆలోచించిన బాలయ్య, బోయపాటి శ్రీనును పక్కన పెట్టి, బాబిని లైన్‌లోకి తీసుకున్నాడు అంటూ కొందరు అంటున్నారు. బాలకృష్ణ ఏదో అనుకొని ఈ పవర్ ఫుల్ పొలిటికల్ సినిమాని ఆపేసినందుకు మాత్రం ఆయన అభిమానులు నీరుగారిపోతున్నారు.