మంత్రి మల్లారెడ్డిని ఇమిటేట్ చేసిన నవీన్ పొలిశెట్టి.. వీడియో చూస్తే న‌వ్వులే న‌వ్వులు!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి గురించి ప‌రియాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ వీడియోలు చేస్తే స్థాయి నుంచి.. ఏకంగా అనుష్క శెట్టికి జోడీగా న‌టించే రేంజ్ కు ఎదిగాడు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`. యూత్ ఫుల్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి పి. మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం ఆగ‌స్టు 4న విడుద‌ల విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా ఈ మూవీని ప్ర‌మోట్ చేసేందుకు న‌వీన్ పొలిశెట్టి.. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్థాపించిన CMR కాలేజ్ కు వెళ్లాడు. అయితే మల్లారెడ్డి ఇమిటేట్ చేస్తూ హుషారైన స్పీచ్ తో న‌వీన్ పొలిశెట్టి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

మీ పెద్దాయన మల్లారెడ్డి సార్ ఉంటారనుకుని వచ్చా. ఆయన స్టైల్, స్పీచ్ అంటే నాకు ఇష్టమ‌ని పేర్కొన్న న‌వీన్ పొలిశెట్టి.. మల్లారెడ్డి ఫేమస్ డైలాగ్ ‘పాలమ్మినా.. పూలమ్మినా’ను తన స్టైల్ లో చెప్పాడు. `క‌ష్ట‌ప‌డ్డా.. ఇన్ని హిట్లు ఏడి కెళ్లివ‌చ్చిన‌య్‌.. ఎట్లొచ్చిన‌య్‌.. నేనేమైనా మాయ‌చేసినా.. నేనేమైనా మంత్రం జేసిన్నా.. క‌ష్ట‌ప‌డ్డా. స్క్రిప్ట్‌లు రాశినా.. యూట్యూబ్‌లో వీడియోలు తీసినా.. అనుష్క‌తో హీరోగా జేసినా.. సక్సెస్ అయినా’ అంటూ మల్లారెడ్డిని ఇమిటేట్ చేస్తూ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు ప‌డి ప‌డి న‌వ్వుకుంటున్నారు.