పెళ్లి గురించి హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్..!!

నితిన్ నటించిన జయం సినిమా ద్వారా మొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు తమిళ్ భాషలో కూడా నటించి మంచి పాపులాలకి సంపాదించింది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక వెలుగు వెలిగిన సదా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించింది ఇటీవల డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింసా సినిమాలో నటించినది.

Sada Show without wearing anything inside: Eda gap to be seen clearly! |  Actress Sadha Latest Sizzling Photoshoot Viral

ఇక అంతే కాకుండా బుల్లితెరపై పలు రకాల షోలలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. అయితే సదా తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అందరూ కూడా వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు కానీ సదా మాత్రం ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తలేదు. తాజాగా ఒక కార్యక్రమంలో భాగంగా సదా పెళ్లి గురించి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏమి లేదు పెళ్లి చేసుకుంటే తనకు ఉన్నటువంటి ఫ్రీడమ్ పోతుందని అందుకే పెళ్లి చేసుకోలేదు.కాబట్టి తాను సంతోషంగా ఉన్నానని తెలిపింది.

ముఖ్యంగా సదా ఫారెస్ట్ టూర్స్ వంటి కి వెళ్తూ జంతువుల ఫోటోలను సైతం కలెక్ట్ చేస్తూ ఉంటుంది.పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కుదరదు కాబట్టి సదా వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం సదా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి గతంలో కూడా ఒక హీరోని చాలా గాఢంగా ప్రేమించిందని ఆ హీరోతో లవ్ బ్రేక్అప్ వల్లే ఈమె వివాహం చేసుకోలేదని రూమర్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.