బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` అల్ల‌క‌ల్లోలం.. ఫ‌స్ట్ డే కంటే 5వ రోజే ఎక్కువ!

చిన్న సినిమాగా వ‌చ్చిన `బేబీ` గ‌త ఐదు రోజుల నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద అల్ల‌క‌ల్లోలం సృష్టించింది. స్టార్ హీరోల సినిమాల‌తో స‌మానంగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇంకేముంది థియేట‌ర్స్ లో బేబీ దున్నేస్తోంది. వీకెండ్ లోనే కాదు వ‌ర్కింగ్ డేస్ లోనూ సూప‌ర్ స్ట‌డీగా వెళ్తూ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. మూడో రోజుకే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయింది. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఫ‌స్ట్ డే కంటే 5వ రోజే ఎక్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి భారీ లాభాల‌తో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 2.60 కోట్ల షేర్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఐదో రోజు ఏకంగా రూ. 2.94 కోట్లు రాబ‌ట్టింది.

అలాగే వరల్డ్ వైడ్ గా ఐదో రోజు రూ. 3.30 కోట్ల షేర్ ని వ‌సూల్ చేసి ఊచకోత కోసింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8 కోట్లు కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 18.71 కోట్ల షేర్‌, రూ. 34.90 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుని డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఈ లెక్క‌న బేబీకి రూ. 10.71 కోట్ల ప్రాఫిట్ ల‌భించింది. ఈ ఫిగ‌ర్ మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఏరియాల వారీగా బేబీ 5 డేస్ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 6.81 కోట్లు
సీడెడ్: 2.28 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.65 కోట్లు
తూర్పు: 1.24 కోట్లు
పశ్చిమ: 70 లక్ష‌లు
గుంటూరు: 87 లక్ష‌లు
కృష్ణ: 97 లక్ష‌లు
నెల్లూరు: 56 లక్ష‌లు
—————————————————–
ఏపీ+తెలంగాణ = రూ. 16.01 కోట్లు(రూ. 28.15 కోట్లు~ గ్రాస్)
—————————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 70 లక్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 2.00 కోట్లు
—————————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్‌= రూ. 18.71 కోట్లు(రూ. 34.90 కోట్లు~ గ్రాస్)
—————————————————–