సందడి తగ్గించిన సంయుక్త.. కారణం..?

తెలుగు ఇండస్ట్రీకి మలయాళ బ్యూటీ అయిన సంయుక్త మీనన్ మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించింది. ఆ తరువాత తమిళ్ స్టార్ ధనుస్సుతో సార్ , బింబి సార సినిమాలో నటించి మంచి సక్సెస ను సంపాదించుకుంది. ఆ తరువాత విరుపాక్ష సినిమాతో ఇంకాస్త అలరించింది. ఇప్పుడు ఈమె టాలీవుడ్ లో లక్కీ పర్సన్ గా ఎదిగిపోతోంది. ఎందుకంటే ఒక సినిమా తర్వాత మరొక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటు సంయుక్త మీనన్ స్టార్ స్టేటస్ ను అందుకుంది.

Samyuktha Menon will be part of 'Bheemla Nayak' | Moviekoop

ఇక ఇప్పుడు సంయుక్త మీనన్ డెవిల్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ సినిమా పై భారీ అంచనాలు పెంచడంతో మళ్లీ సంయుక్త హిట్ ఖాతాలో ఈ సినిమా కూడా చేయబోతుందని నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ అమ్మడికి డెవిల్ సినిమా తర్వాత వేరే అవకాశాలు రాలేదట.. అంతేకాకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే ఏమైంది తగ్గించుకోవడం కన్నా ఉన్న క్రేజీ ని మరింత పెంచుకునేలా ప్లాన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఒక టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా సార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో కూడా స్టార్ ఫాలోయింగ్ ని బాగానే పెంచుకుంది. అయితే తెలుగులో మాత్రం డెవిల్ సినిమా తర్వాత ఏ సినిమాని ఎంచుకోలేదు. తెలుగులో అవకాశాలు రాకపోయినా తమిళంలో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. కెరియర్ గ్రాఫ్ పెంచుకునే క్రమంలో ఎలాంటి మొహమాటలకు వెళ్లకుండా కేవలం నచ్చిన కథలను మాత్రమే చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది సంయుక్త.. అందుకే ఈ అమ్మడుకు ఆఫర్లు తగ్గాయని సమాచారం గ్లామర్ రోజుకి తాను దూరం కాదు కానీ ఎలాంటి పాత్ర వచ్చిన అది నచ్చితే కచ్చితంగా చేస్తానని తెలియజేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలలో నటిస్తుందో చూడాలి మరి.