`బేబీ` బీభ‌త్సం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు.. రూ. 8 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలిస్తే మెంట‌లెక్కిపోతారు!

బాక్సాఫీస్ వ‌ద్ద బేబీ మూవీ బీభ‌త్సం ఇప్ప‌ట్లో ఆగేలా క‌నిపించ‌డం లేదు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. హ‌ర్ట్ ట‌చ్చింగ్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కు ద‌గ్గ‌ర పోలిక‌ల‌తో యూత్ కు క‌నెక్ట్ అయ్యే క‌థ‌తో వ‌చ్చిన బేబీ తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బేబీకి.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిందెంతో తెలిస్తే మెంట‌లెక్కిపోతారు.

ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌మ‌యానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.35 కోట్లు, వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 11.33 కోట్లు షేర్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన బేబీ.. వ‌ర్కింగ్ డేస్ లోనూ దుమ్ము దుమారం రేపుంలో 4వ రోజు సోమ‌వారం తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.72 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రచ్చ రచ్చ చేసింది. వరల్డ్ వైడ్ గారూ. 4.08 కోట్ల షేర్ ని ద‌క్కించుకుంది. ఇక ఏరియాల వారీగా బేబీ నాలుగు రోజుల టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం: 5.63 కోట్లు
సీడెడ్: 1.75 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 2.13 కోట్లు
తూర్పు: 1.00 కోట్లు
పశ్చిమ: 58 లక్ష‌లు
గుంటూరు: 71 లక్ష‌లు
కృష్ణ: 80 లక్ష‌లు
నెల్లూరు: 47 లక్ష‌లు
—————————————————–
ఏపీ+తెలంగాణ = రూ. 13.07 కోట్లు(రూ. 22.80 కోట్లు~ గ్రాస్)
—————————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 56 లక్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 1.78 కోట్లు
—————————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్షన్స్‌= రూ. 15.41 కోట్లు(రూ. 28.60 కోట్లు~ గ్రాస్)
—————————————————–

మొత్తానికి విడుద‌లైన మూడో రోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసిన బేబీ.. ప్ర‌స్తుతం రూ. 7.41 కోట్ల ప్రాఫిట్ ను సొంతం ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతోంది.