లిప్‌లాక్‌లకు ఏమాత్రం మొహమాటపడని హీరోయిన్.. ఆమె వద్దకు క్యూ కడుతున్న డైరెక్టర్లు..

ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన లిప్ లాక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆడియన్స్ కూడా ఎక్కువగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకు రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించినప్పటికీ మంచి బ్రేక్ మాత్రం రావడం లేదు.

నందిత శ్వేత ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై షోస్ లో హోస్ట్ గా తన సత్తా చాటుకుంటుంది. సాధారణంగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్ అంటే చాలా డీసెంట్ పాత్రల్లో మాత్రమే నటిస్తారు. బోల్డ్ సీన్స్ లో నటించడానికి కన్నడ హీరోయిన్లు ఎక్కువగా ఇష్టపడరు. మొన్నటి వరకు నందిత శ్వేత కూడా అదే బాటలో నడిచింది. కానీ అలా ఉండటం వల్ల పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ అమ్మడు తన ఆలోచనలను మార్చుకుంది. ప్రస్తుతం ఎలాంటి సీన్స్ లో అయినా నటించడానికి ఓకే చెప్పేస్తుంది.

ఇటీవల అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘హిడింబ’ సినిమాలో నందిత లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందిత మాట్లాడుతూ హిడింబ సినిమాలో తాను ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ లో నటించినట్లు తెలిపింది. ఇప్పటివరకు అలాంటి సీన్స్ కి దూరంగా ఉన్నాను కానీ కంటెంట్ డిమాండ్ చెయ్యడంతో లిప్ లాక్ సీన్స్ లో నటించక తప్పలేదు అని చెప్పుకొచ్చింది. సినిమా కోసం నందిత కాస్త బరువు కూడా తగ్గాల్సి వచ్చిందట. నందిత మాటలు విన్న డైరెక్టర్లు నిర్మాతలు అందరూ వారి సినిమాల్లో ఎక్కువ రొమాంటిక్ సీన్స్, లిప్స్ లిప్ లాక్ సీన్స్ ఉంటే గనక ఈ కన్నడ బ్యూటీ నే సంప్రదించాలని నిర్ణయించుకుంటున్నారట.