చిన్నమ్మతో బాలయ్య చిన్నల్లుడుకు చిక్కులు.!

ఏపీ బి‌జే‌పి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఆమె విరుచుకుపడుతున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలు ఆమెని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా సర్పంచ్‌లు..పంచాయితీలకు నిధులు రావడం లేదని, కేంద్రంతో మాట్లాడాలని పురందేశ్వరిని కోరారు. దీంతో ఆమె తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

ఇలా దూకుడుగా ఉన్న పురందేశ్వరి.. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేనలతో బి‌జే‌పి పొత్తు ఉంటే ఆమెకు ఏ సీటు దక్కిన గెలుపు అవకాశాలు ఉంటాయి. అయితే ఆమె ఎక్కువ శాతం విశాఖ ఎంపీ సీటునే కోరుకునే ఛాన్స్ ఉంది. గతంలో అక్కడ పోటీ చేసే గెలిచారు. గత ఎన్నికల్లో బి‌జే‌పి నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. పొత్తు ఉన్నా లేకపోయినా ఆ సీటులోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక పొత్తు ఉంటే విశాఖ సీటు అడిగితే బాలయ్య చిన్నల్లుడు భరత్‌కు ఇబ్బంది అవుతుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి భరత్ పోటీ చేసి కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ సారి అక్కడే పోటీ చేయాలని చూస్తున్నారు. పొత్తు ఉంటే సీటు త్యాగం చేయాల్సి ఉంటుంది.

ఇక పొత్తు లేకపోయిన భరత్‌కు రిస్క్ తప్పదు. ఓట్లు చీలిపోయి నష్టం జరుగుతుంది. గత ఎన్నికల్లో భరత్ ఓడిపోయిన మెజారిటీ 4 వేలు..పురందేశ్వరికి పడిన ఓట్లు 30 వేలు. అంటే ఓట్ల చీలిక ఓటమికి కారణమైంది. మరి ఈ సారి విశాఖలో ఏం జరుగుతుందో చూడాలి. బాలయ్య చిన్నల్లుడు పొజిషన్ ఎలా ఉంటుందో.