సోను సూద్ జీవితంలో కూడా అంతులేని విషాదాలు ఉన్నాయా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు సోనుసూద్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కరోనా సమయంలో ఎంతోమంది పేదవారికి సహాయం చేసి ప్రజల పాలిట దేవుడిగా మారారు.. అరుంధతి సినిమాలో వదలను బొమ్మాలి అనే డైలాగుతో అందరిని ఆకట్టుకున్న సోనూసూద్ టాలీవుడ్ లో విలన్ గా ఎన్నో చిత్రాలలో నటించారు. ఈరోజు సోనూసూద్ 50వ పుట్టినరోజు సందర్భంగా సోనుసూద్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

Sonu Sood Birthday कुछ ही रूपये लेकर मुंबई आए थे सोनू सूद इन फिल्मों से  कमाया नाम पैनडेमिक में बने मसीहा - Happy Birthday Sonu Sood Struggle Movies  and role during Coronavirus

సోనూసూద్ పంజాబ్లో 1973 జులై 30న జన్మించారు.. ఇక సోనుసూది తల్లి ప్రొఫెసర్ తండ్రి బట్టల వ్యాపారి. సహాయపడడంలో చిన్న వయసు నుంచి సోనూసూద్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో ఎందరికో ఆకలి తీర్చిన దేవుడిగా పేరుపొందారు. స్నేహితులతో కలిసి పలు రకాల సేవలను కూడా ప్రారంభించి మంచి పేరు సంపాదించారు.. సోషల్ మీడియాలో ఎవరైనా సహాయం కావాలి అంటూ ట్విట్ చేస్తే చాలు వెంటనే వారి కష్టాలను తీర్చేలా మారిపోయారు సోను సూద్.. చదువుపరంగా ఇంజనీర్ చదివిన సోనుసూద్ మోడలింగ్ వైపు ఆసక్తి ఉండడంతో అటుగా ఎంట్రీ ఇచ్చారు.

19 Lesser-Known Facts About Sonu Sood, The Real Life Hero

మొదట కల్లాజగర్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనుసూద్ హ్యాండ్సప్ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత అతడు, అశోక్ ,అరుంధతి ,బంగారు బాబు ఏక్ నిరంజన్ తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. సోనూసూద్ వైఫ్ సోనాలి..

Behind Sonu Sood's drive to help migrants, a sense of 'Punjabiyat' and a  desire to make his parents proud | India News - The Indian Expressవీరికి ఇద్దరు అబ్బాయిలు నటుడుగా కెరియర్ ప్రారంభించక ముందే సోనుసూది తల్లి మరణించారు ఆ తర్వాత నాలుగేళ్ల క్రితం తండ్రి కూడా మరణించినట్లు తెలుస్తోంది.సోను జీవితంలో తల్లితండ్రుల మరణం మరిచిపోలేని విషాదంగా మిగిలాయట.. సోను సూదుకు వ్యాయామం అంటే చాలా ఇష్టమట రోజుకు కనీసం రెండు గంటలైనా వ్యాయామం చేస్తారని సమాచారం.