టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న `బ్రో`.. 2 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

`బ్రో`.. జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన `వినోద‌య సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది.

కానీ, అంచ‌నాల‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద బ్రో దూసుకుపోతోంది. మొద‌టి రోజే రూ. 30 కోట్ల క‌లెక్ష‌న్స్ ను వ‌సూల్ చేసేసి దుమ్ము దుమారం లేపింది. రెండో రోజు కూడా గుడ్ హోల్డ్ ను చూపించింది.

రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.38 కోట్లు షేర్‌, రూ. 16.85 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను అందుకుంది. అలాగే వ‌ర‌ల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో రూ. 42.24 కోట్ల షేర్‌, రూ. 69.50 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను బ్రో మూవీ సొంతం చేసుకుంది. ఈ లెక్క‌న బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఇంకా రూ. 56.26 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక ఏరియాల వారీగా బ్రో మూవీ 2 డేస్‌ క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి…

నైజాం: 13.25 కోట్లు
సీడెడ్: 4.05 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 4.08 కోట్లు
తూర్పు: 3.09 కోట్లు
పశ్చిమ: 3.26 కోట్లు
గుంటూరు: 3.25 కోట్లు
కృష్ణ: 1.97 కోట్లు
నెల్లూరు: 1.04 కోట్లు
—————————————–
ఏపీ+తెలంగాణ‌= 33.99 కోట్లు(52.35 కోట్లు~ గ్రాస్)
—————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 3.15 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 5.10 కోట్లు
———————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 42.24 కోట్లు(69.50కోట్లు~ గ్రాస్)
———————————————-