డేంజర్ జోన్‌లో 40 మంది ఎమ్మెల్యేలు..జగన్ ప్లాన్ ఏంటి?

18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు తిరగడం లేదని, వారి పేర్లు చెప్పను గాని…వారితో తాను వ్యక్తిగతంగా మాట్లాడతానని ఇటీవల సమీక్షా సమావేశంలో చెప్పుకొచ్చారు. అయితే పైకి చెప్పింది 18 మంది ఎమ్మెల్యేలు…అసలు వైసీపీలో పనితీరు దారుణంగా ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నారట. వారికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ ఇప్పుడు ఆలోచనలో ఉన్నారని తెలిసింది.

మామూలుగా గడపగడపకు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధం లేదనే చెప్పాలి. గడపగడప అంటే కేవలం..ప్రభుత్వ పథకాల అందుతున్న లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి..మీకు ఇన్ని పథకాలు వస్తున్నాయని చెప్పడమే..కానీ అక్కడ సమస్యలు, అభివృద్ధి పనులు చేయడం లేదు. ఇలా పనులు సరిగ్గా చేయని వారిపై ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది.  అలాంటి వారిపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని వైసీపీ సర్వేలోనే తేలిందని సమాచారం. అంటే బాగా దారుణమైన పనితీరు ఉన్న ఎమ్మెల్యేలు 40 మంది వరకు ఉన్నారట. జగన్‌ని పక్కన పెడితే..మొత్తం 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అందులో 40 మంది తీస్తే ఇంకా 110..మరి అందులో యావరేజ్ గా పనిచేసేవారు ఉంటారు. ఈ లెక్కలు అన్నీ వేసుకుంటే వైసీపీకే ఇబ్బంది అయ్యేలా ఉంది. అయితే 40 మంది ఎమ్మెల్యేలపై జగన్ ఇప్పుడు ఫోకస్ పెట్టారట..ఈ కొన్ని నెలల్లో పనితీరు మెరుగు పర్చుకుంటే పర్లేదు..లేదంటే సీటు ఇచ్చే ప్రసక్తి లేదని తెలుస్తుంది. కాకపోతే ఒకేసారి అంతమందికి సీట్లు ఇవ్వకపోవడం అనేది ఇబ్బందే.

అలా సీటు దక్కని వారు టి‌డి‌పిలోకి జంప్ చేసి..వైసీపీకి నష్టం చేయవచ్చు. అందుకే జగన్ సీటు పంపకాలపై ఆచి తూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి జగన్ ఎంతమందికి సీటు ఇవ్వకుండా ఉంటారో.