ఈ బాలయ్య సినిమా బడ్జెట్ కేవలం లక్షే.. బాక్సాఫీస్ కలెక్షన్ మాత్రం రూ.5 కోట్లు!!

బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో వందకు పైగా సినిమాలు తీశాడు. వాటిలో చాలా సినిమాలు హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. అయితే వీటన్నిటిలో ఒక సినిమా మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే దీనిని కేవలం లక్ష రూపాయలతో తీస్తే దాదాపు 5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు అందరికీ బాగా ఇష్టమైన మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎస్ గోపాల్ రెడ్డి నిర్మాణంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడింది.

సుహాసిని హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో “దంచవే మేనత్త కూతురా..” పాట సూపర్ హిట్ అయింది. ఎస్ గోపాల్ రెడ్డి కేవలం లక్ష రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా లాంగ్ రన్‌లో నాలుగు కోట్ల 80 లక్షల రూపాయలు సంపాదించింది. 1984లో అంటే దాదాపు 40 ఏళ్ల కిందట ఈ సినిమా ఇంచుమించు ఐదు కోట్లు సంపాదించింది. అప్పట్లో ఈ అమౌంట్ ఇప్పటితో పోలిస్తే వందల, వేల కోట్లతో సమానం అని చెప్పవచ్చు.

ఈ ఒక్క సినిమాతోనే గోపాల్ రెడ్డి చాలా లాభపడ్డారు. బాలకృష్ణ ఈ మూవీతో స్టార్ హీరోగా మారి చిరంజీవికి పోటీగా నిలిచాడు. ఈ మూవీలో భానుమతి మంగమ్మగా నటించింది. బాలకృష్ణ, భానుమతి కలిసి ఈ సినిమాలో ఎన్నో సన్నివేశాలను బాగా పండించారు. ఇక సుహాసిని రొమాంటిక్ సన్నివేశాలలో చక్కగా నటించి ఆకట్టుకుంది. ఈ మూవీ అప్పట్లో హైదరాబాద్‌లో 565 రోజుల పాటు ఆడి రికార్డు సృష్టించింది. కర్ణాటక థియేటర్లలో కూడా 100 రోజులకు పైగా నడిచి చరిత్ర తిరగరాసింది.