`ఆదిపురుష్‌`లో సీత పాత్ర కోసం కృతి స‌న‌న్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్‌, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు.

జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి స‌న‌న్ ఆదిపురుష్ కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది.

అలాగే సీత పాత్ర కోసం త‌న‌నే ఎందుకు తీసుకున్నారో కూడా వివ‌రించింది. ఆదిపురుషుల్ లో ఛాన్స్ అందుకోవడం తన అదృష్టమని.. గతంలో తన హైట్ ఎక్కువగా ఉండటం వ‌ల్ల‌ సరైన ఆఫర్లు వచ్చేవి కాదని, కానీ ఆదిపురుష్ విషయంలో అదే త‌న‌కు ప్ల‌స్ అయింద‌ని పేర్కొంది. ప్రభాస్ రాముడిగా నటించడం, సీతగా తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. మొత్తానికి హైట్ కార‌ణంగానే సీత పాత్ర కోసం త‌న‌ను ఎంచుకున్నార‌ని కృతి స‌న‌న్ వెల్ల‌డించింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.