పేర్ని నాని రాజకీయం..వారసుడుకు పవన్ దెబ్బ.!

వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు అంటే..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే అన్నట్లు ఉన్నారు. మంత్రులుగా వారు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సేవ చేస్తున్నారు. మాజీ మంత్రులు తమ తమ స్థానాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు..పార్టీకి ఏ మేర ఉపయోగపడుతున్నారు? అంటే అవేం లేవు..కేవలం ప్రతిపక్షాలని తిట్టడానికే తాము ఉన్నామనే విధంగా నేతల తీరు ఉంది.

అందులో కొడాలి నాని అంటే చంద్రబాబుని తిట్టడానికి, పేర్ని నాని అంటే పవన్‌ని తిట్టడానికి అన్నట్లు ఉన్నారు. వీరు నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారో తెలియదు గాని..కేవలం మీడియా ముందుకొచ్చి బాబు, పవన్‌ని తిట్టడంలో బిజీగా ఉంటున్నారు. తాజాగా పవన్..జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అవేమీ ఘాటుగా చేసిన విమర్శలు కాదు పాలసీ పరంగా చేసిన విమర్శలు..కానీ పేర్ని వెంటనే మీడియా సమావేశం పెట్టి..పవన్ ఎప్పుడో ఒకసారి చెప్పు చూపించారని చెప్పి..ఇప్పుడు తాను రెండు చెప్పులు చూపించారు. ఈ అంశంపై పేర్నిపై విమర్శలు వస్తున్నాయి.

ఒక సీనియర్ నాయకుడై ఇలా దిగజారిపోయే పరిస్తితి ఎందుకని, పవన్ గతంలో ఆవేశంలో చూపించారని, అది కూడా కరెక్ట్ కాదని, కానీ అన్నీ తెలిసి పేర్ని ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఇక పేర్ని విమర్శలకు పవన్ కౌంటర్ ఇవ్వలేదు..తాము మాటలు చెప్పమని చేతల్లోనే చూపిస్తామని చెప్పుకొచ్చారు. అంటే పేర్ని నాని లాంటి వారిని ఓడించడమే తమ టార్గెట్ అన్నట్లు పవన్ చెప్పారు.

అయితే పవన్ వల్ల పేర్ని నానికి కాదు గాని..ఆయన తనయుడుకు రిస్క్ ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో పేర్ని పోటీ చేయకుండా తన తనయుడుని మచిలీపట్నం బరిలో దింపుతున్నారు. అక్కడ టి‌డి‌పి బలంగా ఉంది..అదే సమయంలో జనసేన ప్రభావం ఉంది. గత ఎన్నికల్లో పేర్ని నాని..టి‌డి‌పి అభ్యర్ధి కొల్లు రవీంద్రపై కేవలం 6 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పుడు జనసేనకు 18 వేల ఓట్లు పడ్డాయి. అయితే 2009లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల పేర్ని గెలిచారు..2019లో జనసేన వల్ల గెలిచారు. కానీ ఇప్పుడు టి‌డి‌పి, జనసేన కలుస్తున్నాయి..పైగా వైసీపీ బలం తగ్గింది. దీంతో పేర్ని వారసుడుకు ఈ సారి పవన్ దెబ్బ తగిలేలా ఉంది.