లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియా భవాని..!!

కోలీవుడ్లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది.

Priya Bhavani Shankar: I will never go back to television ever again |  Monster | SJ Suryah- Cinema express

ఇండియన్-2, సూర్య సరసన బొమ్మై వంటి చిత్రాలలో నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే.. క్యాస్టింగ్ కౌచ్ విషయాలపై ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగా మాట్లాడారు.. అయితే ఇవి ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాలలో ఉన్నాయి అలాంటివారు తమకు జరిగే అన్యాయాల గురించి చాలా ధైర్యంగా చెప్పుకోవాలి.. ఇలాంటి విషయాలను చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా హేళన చేయడం మానుకోవాలి.. లైంగిక వేధింపులకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం మంచిది అని తెలిపింది ప్రియా భావాన్ని శంకర్. కాస్టింగ్ కౌచ్ రోజురోజుకు పెరుగుతూనే ఉందంటూ తెలిపింది ప్రియా భవాని.

A Day to Remember” – Priya Bhavani Shankar opens a new hotel

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఎవరో ఒకరు ప్రతిరోజు స్పందిస్తూనే ఉంటారు. సినిమా రంగంలో అవకాశాలు రావాలి అంటే కొంతమంది పడకగదికి పిలుస్తూ ఉంటారు దీనిని క్యాస్టింగ్ కౌచ్ అంటారు.. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది మహిళలను వేధిస్తున్న సమస్య.. ఇది అన్ని ఇండస్ట్రీలలో కూడా కలదు. తాజాగా ప్రముఖ యాంకర్ నటి అయిన ప్రియా భవాని శంకర్ క్యాస్టింగ్ కౌచ్ పైన చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.