కెరీర్ లోనే తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్న చైతు.. హిట్ కావాలంటే త‌ప్ప‌దు మ‌రి!?

యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య మ‌ళ్లీ వ‌రుస ఫ్లాపుల్లో కూరుకుపోయాడు. ఈయ‌న నుంచి చివ‌రిగా వ‌చ్చిన థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్దా తో పాటు రీసెంట్ గా విడుద‌లైన క‌స్ట‌డీ మూవీతో స‌హా బాక్సాపీస్ వ‌ద్ద బొక్క‌బోర్లా ప‌డ్డాయి. ప్ర‌స్తుతం హిట్ కోసం ప‌రిత‌పించిపోతున్న నాగ‌చైత‌న్య‌.. త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను కార్తికేయ‌, కార్తికేయ 2 చిత్రాల‌తో చందూ ముండేటి ద‌ర్శ‌క‌త్వంలో ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అర‌వింద్‌, బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాపై తాజాగా నిర్మాత బ‌న్నీ వాసు ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రివీల్ చేశారు. చైతు ఎలాంటి పాత్ర‌ను పోషించ‌బోతున్నాడో చెప్పేశాడు.

చందూ ముండేటి సినిమాలో నాగ‌చైత‌న్య నాగ ఛైతన్య మత్స్యకార యువకుడిగా.. జాలరిగా కనిపించబోతున్నట్లు బన్నీ వాసు తెలిపారు. సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ గా చైతు న‌టిస్తున్నాడ‌ని ఆయ‌న తెలిపారు. కెరీర్ లోనే చైతు తొలిసారి ఇలాంటి పాత్ర‌ను పోషిస్తున్నారు. ఇంత‌వ‌ర‌కు చైతు దాదాపు సాఫ్ట్ పాత్ర‌ల్లోనే క‌నిపించారు. మొద‌టిసారి హిట్ కోసం ఊర‌మాస్ పాత్ర‌లో ప్ర‌యోగం చేయ‌బోతున్నాడు. కాగా, గుజరాత్ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నార‌ని.. ప్రేమకథ తో పాటు ఎమోషన్స్, యాక్షన్స్ ఎలివేషన్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవ‌ల్ లో ఉంటాయ‌ని తెలుస్తోంది.