మంచు లక్ష్మి చేసిన పనికి షాక్ లో అభిమానులు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది… మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. ఈమె నటిగా, యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా ఎవరికైనా సహాయం చేయాలనే గొప్ప మనసు కలిగిన మహిళగా పేరు సంపాదించింది మంచు లక్ష్మి.. ఇప్పటికీ మంచు కుటుంబం తమ విద్యాసంస్థలతో ఎంతోమందికి ఉన్నతమైన విద్యను కూడా అందించడం జరుగుతోంది.

అయితే అంతటితో ఆగకుండా మంచు లక్ష్మి టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీవో ను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఈ సమస్త వల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసులు ఇంగ్లీష్ క్లాసులు వంటివి ఏర్పాటు చేస్తోంది.అంతేకాకుండా చాలామంది పిల్లలకు చదువుపరంగా సపోర్ట్ చేస్తూ వారి యొక్క భవిష్యత్తుకి అండగా నిలుస్తోంది మంచు లక్ష్మి.. ఈ క్రమంలోనే ఇప్పటికే శ్రీకాకుళం యాదాద్రి జిల్లాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 500కు పైగా ప్రభుత్వ బడులను స్మార్ట్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాటు చేయడం జరిగింది మంచు లక్ష్మి.

People are afraid to offer me roles as I am a superstar's daughter: Lakshmi  Manchu | Deccan Herald
ఇప్పుడు తాజాగా ఈమె జోగులాంబ గద్వాల జిల్లాలోని మరొక 30 పాఠశాలలో దత్తకు తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఈనెల 28వ తేదీన గద్వాల్ కలెక్టరెట్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలవడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం వలన ఇప్పటికే ఎంతోమంది పాఠశాలలోని విద్యార్థులు మంచి ఫలితాలను చూసాము.. ఆ ఫలితాలే తమకు స్ఫూర్తిగా నిలిచి ప్రతి ఏటా మరికొన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు అమలు చేయాలని ఇప్పుడు ఈ గద్వాల్ జిల్లాలోని 30 స్కూళ్లని ఎంపిక చేసుకున్నామని తెలియజేశారు. వీటిలో స్మార్ట్ క్లాసులతో పాటు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది మంచు లక్ష్మి. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేసేవారు చాలా అరుదుగా ఉంటారని తెలియజేస్తున్నారు.