ఆ స్టార్ హీరో కోసం అలాంటి పని చేస్తున్న బ్రహ్మానందం..!!

తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పేరు చెప్పగానే పెదవిపైన కచ్చితంగా చిరునవ్వు రానే వస్తుంది. అంతలా ఆయన పాత్రలలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటారని చెప్పవచ్చు. తరచూ సోషల్ మీడియాలో బ్రహ్మానందం మిమ్స్ కనిపిస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం చేసే ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తూ ఉంటాయి. అయితే స్క్రీన్ పై కొన్ని కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయని కొన్ని సార్లు చెప్పవచ్చు. అలా త్రివిక్రమ్, బ్రహ్మానందం కాంబినేషన్లో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి.

COVID-19: Actor Brahmanandam lightens the pandemic burden as his memes  flood the online space - The Hindu
ఇక అతడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులోని డైలాగులు కామెడీ ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఎంతో అద్భుతంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. త్రివిక్రమ్ రాసిన సన్నివేశాలు బ్రహ్మానందం చెప్పే డైలాగులు కామెడీ ప్రేక్షకులను బాగా నవ్విస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ ఎందుకో సెట్ కాలేదు కాని ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక జల్సా సినిమాలో కూడా కానిస్టేబుల్ ప్రనైలాగా అందరిని ఆకట్టుకొని ఈ సినిమా విజయానికి దోహదపడ్డాడు బ్రహ్మానందం. మళ్లీ అంతగా సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆకట్టుకున్నారు.

Trivikram Searching Old DVDs For Brahmi Role? - ManaTelugu
గత కొన్నేళ్లుగా బ్రహ్మానందం త్రివిక్రమ్ కాంబినేషన్ తెరపైన కనిపించలేదు చాలా గ్యాప్ రావడంతో అభిమానులు వీరి కాంబినేషన్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరు కారం సినిమాలో ఎనిమిదేళ్ల తర్వాత బ్రహ్మానందం కోసం ఒక పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ మార్పులో భాగంగా మహేష్ సూచన మేరకే త్రివిక్రమ్ ఇలా డిజైన్ చేశారని సమాచారం. మరి మహేష్ బాబు కోసం బ్రహ్మానందం ఈ సినిమాలో నటిస్తారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మళ్లీ బ్రహ్మానందం ,మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చూడవచ్చని చెప్పవచ్చు.