రీ రిలీజ్ కు సిద్ధమైన..M S. ధోని చిత్రం.. ఎప్పుడంటే..?

గత కొద్దిరోజుల నుంచి తెలుగు చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండు కొనసాగుతూనే ఉంది.. టాలీవుడ్ స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క చిత్రాలను మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మహేష్ ,పవన్ ,ఎన్టీఆర్ ,రామ్ చరణ్ తదితర అగ్ర హీరోల సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఒక దిగ్గజ కి క్రికెటర్ వంతు రావడం జరిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ M.S. ధోని బర్తడే జూలై 7వ తేదీ.

MS Dhoni The Untold Story movie review: Sushant Singh Rajput's MSD is  reduced to singing, romancing | Entertainment News,The Indian Express

తెలుగు రాష్ట్రాలలో ఎంఎస్ ధోని సినిమాని రీ రిలీజ్ చేసేందుకు పలు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఆ సినిమా నిర్మాత సంస్థ స్వయంగా ప్రకటించడం జరిగింది.అయితే ఈ సినిమా స్పెషల్ షోలు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలో మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. ఎమ్మెస్ ధోని భారత్ ను 2011 వరల్డ్ కప్ విజయతగా నిలిపిన ధోని జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి 2016లో విడుదల చేశారు.

ఎమ్మెస్ ధోని ది ఆన్ టోల్డ్ స్టోరీ అనే పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోని పాత్రలు దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించగా సాక్షి సింగ్ ధోని పాత్రలో కియారా అద్వానీ నటించింది.. అలాగే ధోని లవర్ గా దిశాపటాని నటించింది కీలకమైన పాత్రలో అనుపంకేర్, భూమిక చావ్లా నటించారు. అందుకు సంబంధించి ఒక ట్విట్టర్ వైరల్ గా మారుతోంది. 2016లో సెప్టెంబర్ 16న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దాదాపుగా 216 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.