బాలయ్య చిత్రంలో ఉదయ్ కిరణ్ ఏ సినిమాలో నటించారో తెలుసా..?

టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే మరణించిన నటులలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని హీరోగా గుర్తుండిపోయారు. మొదటిసారిగా 2000 లో చిత్రం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే మనసంతా నువ్వే సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్..

Uday kiran: Did you know that Uday Kiran worked with Balakrishna? Photo  going viral!

ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉండేది. అందుచేతనే ఉదయ్ కిరణ్ తో సినిమాలు చేయడానికి ఎంతోమంది దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల తన కెరియర్ పైన ప్రభావం చూపడంతో ఉదయ్ కిరణ్ చాలా మానసిక సంఘర్షణకు గురై స్ట్రగులై 2014 జనవరి 6వ తేదీన తన నివాసంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సరిత ఇండస్ట్రీలోని సినీ యాక్టర్స్ని సైతం బాధ కలిగించింది.

గతంలో నందమూరి బాలకృష్ణతో కలిసి ఉదయ్ కిరణ్ దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ సమయంలో స్టార్ పొజిషన్ లోకి చేరారు. ఉదయ్ కిరణ్ కు బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అదే నర్తనశాల.. 2004 మార్చి 1వ తేదీన ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ సెట్ వేసి అందులో షూటింగ్ స్టార్ట్ చేశారట ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉన్నది. బాలయ్య దివంగత నటి సౌందర్య ప్రధాన పాత్రలు నటించారు.కానీ సౌందర్య అకాల మరణంతో ఈ సినిమా ఆగిపోయినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ అభిమన్యుడు పాత్ర కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ సెట్లు అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ బాలకృష్ణ తో దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.