హీరో వెంకటేష్ చెల్లెలు ఎన్ని కష్టాలు పడిందో తెలిస్తే కంటతడి పెట్టుకుంటారు..

విక్టరీ వెంకటేష్, భూమిక జంటగా నటించిన సినిమా వాసు. ఈ సినిమాలో వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించిన మాధవి అలియాస్ వర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది వర్ష. సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లోని హీరోలకు చెల్లెలిగా నటించింది. అలానే ‘నువ్వే కావాలి’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించింది. అలా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకున్న వర్ష తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని మీడియా ముందు వెల్లడించింది.

వర్ష అసలు పేరు మాధవి. ఈమె హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. 1997లో పంజరం అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తరువాత 1998లో ఖైదీగారు సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. 2000వ సంవత్సరం లో తరుణ్ హీరోగా నటించిన నువ్వే కావాలి సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అందుకుంది. నువ్వే కావాలి సినిమాలో వర్ష క్యారెక్టర్ లో నటించగా అందరూ ఆ పేరే ఉంచుకోమనడంతో మాధవి పేరుని తీసి వర్ష అనే పేరుకి ఫిక్స్ అయింది. ఆ తరువాత గిల్లికజ్జలు, ఆహా..!, తమ్ముడు, సుప్రభాతం, సూర్యావంశం లాంటి ఎన్నో సినిమా లో నటించి మెప్పించింది.

 

అలానే వర్ష కన్నడ లో కూడా నటించింది. అంతేకాకుండా బుల్లితెరపై అవకాశాలను దక్కించుకుంది. బుల్లితెర పై లోగిలి, మిస్సమ్మ, సుందరకాండ, తొలిప్రేమ, మనసు మమతా, మళ్ళీ లాంటి చాలా సీరియల్స్ లో నటించి బుల్లితెర అభిమానుల మనసు గెలుచుకుంది. ఇండస్ట్రీలో తన కేరిర్ బిజీ గా కొనసాగుతున్నపుడే యానిమేషన్ కంపెనీ ఓనర్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కొంతకాలనికి తన భర్త యానిమేషన్ కంపెనీ నష్టాలలో కురుకున్న సమయం లో ఎన్నో ఇబ్బందులు పడ్డారట. కోలుకోవడానికి జూంబా ఫిట్నెస్ సెంటర్ ని పెట్టారట. ఆ తరువాత చిన్న చిన్నగా ఫేమస్ అవుతూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డామని వర్ష చెప్పుకొచ్చింది.