రష్మిక కి అలాంటి పనులు చేయడం అంటే అంత ఇష్టమా..? అందుకే విజయ్ దేవరకొండ పడిపోయాడు..!!

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా హిట్ అయిన తర్వాత పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని అమ్మడు ప్రతి భాషలోనూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో రష్మిక మందన హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వరుసగా ఫ్లాప్ సినిమాలు పడినా సరే బాలీవుడ్ స్టార్ హీరోస్ అమ్మడుకు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు.

అందులో ఉన్న మర్మమేంటో వాళ్లకే తెలియాలి. అయితే రష్మిక మందన టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడింది అని వాళ్ళిద్దరి మధ్య ప్రేమయాయణం కొనసాగుతుంది అని వార్తలు వినిపించాయి . ఈ క్రమంలోనే రష్మిక లో విజయ్ దేవరకొండ ఏ క్వాలిటీ చూసి పడిపోయాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . నిజానికి అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా రష్మిక మందన తన పనులు తానే చేసుకుంటుందట.

ఫుడ్ కూడా తాను తానే ప్రిపేర్ చేసుకొని తినడానికి ఇష్టపడుతుందట . అంతేకాదు కుకింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న రష్మిక షూటింగ్ టైంలో ఏ మాత్రం గ్యాప్ దొరికిన కుకింగ్ చేయడానికి ఇష్టపడుతుందట . ఇంటికొచ్చాక తన ఫుడ్ తానే వండుకొని మరి తింటుందట . బహుశా ఈ క్వాలిటీ చూసే విజయ్ దేవరకొండ ఆమెకు పడిపోయి ఉంటాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!