బైరెడ్డి సీటుపై చర్చ…జగన్ ఏం డిసైడ్ చేస్తున్నారు.!

అతి తక్కువ కాలంలోనే వైసీపీకి బాగా క్రేజ్ తెచ్చుకున్న యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కూడా ఒకరు. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న బైరెడ్డికి వైసీపీలో ఫాలోయింగ్ ఎక్కువే. రాష్ట్ర స్థాయిలో ఆయన తెలియని వారు లేరు. ఇక ఈ యువనేత  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏదొక సీటులో పోటీకి దిగాలని భావిస్తున్నారట.

అయితే ఇప్పటికే శాప్ ఛైర్మన్ పదవి ఇచ్చారు..అటు వైసీపీ యువ విభాగానికి అధ్యక్షుడుగా ఉన్నారు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో బైరెడ్డి పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. బైరెడ్డి అనుచరులు సైతం..తమ నేతకు సీటు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన నందికొట్కూరు బాధ్యతలు చూసుకుంటున్నారు. అక్కడ వైసీపీని ఈయనే గెలిపిస్తూ వస్తున్నారు. ఆ సీటు ఎలాగో రిజర్వడ్ కాబట్టి అక్కడ పోటీ చేయడానికి బైరెడ్డికి సాధ్యం కాదు. దీంతో ఆయన కర్నూలు జిల్లాలో మూడు సీట్లపై కన్నేశారని కథనాలు వస్తున్నాయి.

కర్నూలు సిటీ , పాణ్యం, శ్రీశైలం ఈ మూడింటిలో ఏదో ఒకచోట టికెట్ ఇవ్వాలని.. కుదరని పక్షంలో నంద్యాల ఎంపీ సీటు అయినా దక్కించుకోవాలని బైరెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కానీ ఏ సీటు కూడా ఖాళీ లేదు. అన్నీ చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ ఉన్నారు. అలాగే వారు సీనియర్లు..రాజకీయంగా బాగా ప్రభావం చూపే నాయకులు. అలాంటప్పుడు..ఆ నాయకులని పక్కన పెట్టి..బైరెడ్డికి సీటు ఇవ్వడం అనేది కష్టమైన పని.

కాకపోతే జిల్లాలో పనితీరు బాగోని ఎమ్మెల్యేలని సైడ్ చేసి..వాటిల్లో ఏదొక సీటులో బైరెడ్డిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సీటు పక్కా గ్యారెంటీ అని చెప్పడానికి మాత్రం లేదు.