క‌మెడియ‌న్ యోగిబాబు ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకైపోతారు.. హీరోలు కూడా దిగ‌దుడుపే!

యోగిబాబు.. కోలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్స్ లో ఒక‌డు. కోలీవుడ్ సినిమాలు తెలుగులో డ‌బ్ అవ్వ‌డం వల్ల యోగిబాబు ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న‌దైన కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించ‌డంలో యోగిబాబు మ‌హా దిట్ట‌. ఏడాదికి అర‌డ‌జ‌న్ కు పైగా చిత్రాల్లో న‌టించే యోగిబాబు.. ఈ మ‌ధ్య లవ్ టుడే, వారసుడు, కాజ‌ల్ అగ‌ర్వాల్ కోస్టి చిత్రాల్లో అల‌రించాడు.

అలాగే రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ `బిచ్చ‌గాడు 2` మూవీలో బిచ్చ‌గాడి పాత్రలో అద‌ర‌గొట్టేశాడు. ప్ర‌స్తుతం త‌మిళంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కుతున్న `జైల‌ర్‌` మూవీతో స‌హా అనేక సినిమాల్లో భాగం అయ్యాడు. అయితే ఇప్పుడు ఇత‌గాడి రెమ్యున‌రేష‌న్ హాట్ టాపిక్ గా మారింది.

రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కోలీవుడ్ కి చెందిన‌ కొంతమంది హీరోలు కూడా యోగిబాబు ముందు దిగ‌దుడుపే అంటున్నారు. ఎందుకంటే, ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంటే యోగిబాబు ఏకంగా రూ. 18 ల‌క్ష‌ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తాడ‌ట‌. ప‌ది రోజులు షూటింగ్ లో పాల్గొంటే దాదాపు రూ. 2 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఆయ‌న అకౌంట్ లో ప‌డుతుంద‌ట‌. కోలీవుడ్ లో హైయ్య‌స్ట్ పెయిడ్ క‌మెడియెన్స్ లో యోగిబాబు ఒక‌డ‌ని అంటున్నారు.