RRR సినిమాకు మరొక అరుదైన గౌరవం.. ఈసారి ఏకంగా..?

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి పేరు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా అందుకున్న ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఆస్కార్ అవార్డులను సైతం కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు వరల్డ్ వైడ్ గా సినీ ప్రముఖులు సైతం తెగ ఎంజాయ్ చేశారు.

SS Rajamouli reacts after not being invited as The Academy member - India  Today
అలాగే హాలీవుడ్ దర్శకులు కూడా RRR సినిమాని ప్రశంశాల వర్షం కురిపించారు. ప్రపంచం దృష్టిని తెలుగు సినిమా వైపు తీసుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. ఇప్పుడు తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది.. అదేమిటంటే ఆస్కార్ ప్యానెల్ సభ్యుల జాబితాలో చోటు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ సమస్త అకాడమీలో మెయిన్ కమిటీ కాకుండా ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది సభ్యులు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది.. అకాడమీ సభ్యులుగా వివిధ కేటగిరీలలో ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలో ఉన్న పలువురు ఉన్నట్లు సమాచారం.

RRR At Oscars: Jr NTR, Ram Charan, MM Keeravani Invited By The Academy To  Join As Members Post Naatu Naatu Win

ఇక ఇప్పుడు ఈ కమిటీలు 398 మందికి సభ్యత్వం కల్పించారు. ఇందులో RRR చిత్ర బృందానికి చెందిన ఆరుగురు ఉండడం గమనార్హం. ఇందులో రామ్ చరణ్ ఎన్టీఆర్ తో పాటు సంగీత దర్శకుడు కీరవాణి గేయ రచయిత చంద్రబోస్ ఛాయాగ్రహం సెందిల్, ప్రొడక్షన్ డిజైనర్ సీరియల్కు అకాడమీ కమిటీల స్థానం దక్కింది. ఇలా అంటే అరుదైన గౌరవం దక్కించుకున్న వీరందరికీ సోషల్ మీడియాలో పలువురు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరితోపాటు డైరెక్టర్ మణిరత్నం కరణ్ జోహార్లకు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికినట్లు సమాచారం. అయితే వీరంతా వీటిని యాక్సెప్ట్ చేస్తే అకాడమీ మెంబర్గా కొనసాగుతారు. దీనివల్ల వీరు వచ్చే ఆస్కార్ అవార్డు బరిలో సినిమాలకు ఓట్లు వేయవచ్చట.