ప్రభాకర్ తనయుడు చంద్రహాస్‌కు అవే శాపంగా మారాయా.. ఎంట్రీకి లేట్ ఎందుకు?

బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ సీరియల్స్‌ ద్వారానే కాకుండా సినిమాల ద్వారా పేక్షకులను బాగా అలరించాడు. తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈ స్టార్ యాక్టర్ తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని చాలా తపనపడ్డాడు. అందుకు అనుగుణంగా తన వంతు ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ సమయంలో ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ పై బీభత్సమైన ట్రోలింగ్ జరిగింది. ఎంట్రీ ఇవ్వకముందే పెద్ద స్టార్ హీరో అయిపోయినట్లు ఫీల్ అవుతూ చంద్రహాస్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, చేష్టలు ఈ ట్రోలింగ్‌కి దారి తీసాయి.

ఆ సంగతి పక్కన పెడితే చంద్రహాస్ చేతిలో అప్పట్లో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక త్వరలోనే అతడు హీరోగా వెండితెరపై మెరవనున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు అతను చేస్తున్న సినిమాలు ఏంటి? అనే చిన్న అప్‌డేట్ కూడా బయటికి రాలేదు. దీనిపై ప్రభాకర్ గాని చంద్రహాస్ గాని ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు.

అయితే చంద్రహాస్ సినీ కెరీర్ కి ఆదిలోనే బ్రేక్ పడడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది. అదేంటంటే చంద్రహాస్ పై తెలుగు రాష్ట్రాలంతటా నెగిటివ్ ఇన్‌ప్రెషన్ ఏర్పడింది. వీడు హీరో ఏంట్రా అని చాలామంది మీమ్స్‌ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కూడా వదిలారు. వీటన్నిటి మధ్య చంద్రహాస్‌ని హీరోగా పెట్టుకుని సినిమా నిర్మిస్తే తమ జేబుకు చిల్లు తప్ప మిగిలేదేమీ లేదని ప్రొడ్యూసర్స్ భావించారట. ఇక దర్శకులు కూడా అతనితో సినిమా చేసి వృధా అని అనుకున్నట్లు సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా ట్రోల్స్‌యే అతనికి శాపంగా మారాయని ప్రచారం సాగుతోంది. ఒకవేళ చంద్రహాస్‌తో ఏదైనా కామెడీ సినిమా తీస్తే అది హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కామెడీ టచ్ ఉంటే చంద్రహాస్ అందులో బాగా యాక్ట్ చేసే అవకాశం ఉంది. కామెడీ సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతూనే ఉంటాయి కాబట్టి చంద్రహాస్‌ ఆ విధంగా హిట్ అందుకోవచ్చు. ప్రస్తుత ప్రచారం ప్రకారం చంద్రహాస్‌ రూ.50 నుంచి రూ.75 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రహాస్ కి ఏదో ఒక విధంగా కాస్త ప్రజల్లో గుర్తింపు అయితే లభించింది. ఆ గుర్తింపుతో ఇతడు ప్రజలను మెప్పించే సినిమాలు చేస్తే కెరీర్‌లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.