ఆ ఒక్క మాటే నిఖిల్ కొంప ముంచేసిందా..? “స్పై” సినిమా దొబ్బేయడానికి మెయిన్ రీజన్ ఇదే..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో నిఖిల్ సిద్ధార్ధ్ ను ఏకీపారేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్ధ్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు పోతూ వచ్చారు. అందరు హీరోలు సపోర్ట్ తో పైకి వస్తే నిఖిల్ మాత్రం సొంత కష్టంతో టాలెంట్ తో ముందుకు వెళ్తున్నారు . ఈ క్రమంలోనే నిఖిల్ రీసెంట్గా కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అందుకున్నాడు .

ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ రీసెంట్గా “స్పై” అనే మూవీ లో నటించాడు . తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది . సినిమా కథపరంగా కంటెంట్ పరంగా బాగానే ఉన్నప్పటికీ ..ఎక్కడో నిఖిల్ రేంజ్కి ఆ కథ మ్యాచ్ అవ్వలేదు అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు మరికొందరు కావాలని ఈ సినిమాని ప్లాప్ చేశారు జనాలు అంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి .

నిఖిల్ స్పై సినిమా ప్రమోషన్స్ లో భాగంగా “మా వైపు ఏ మీడియా.. ఏ పొలిటికల్ పార్టీ లేదని ..నేను ప్రజల వ్యక్తిని అని ..వాళ్ల నుంచే నేను వచ్చాను” అంటూ చాలా బోల్డ్ గా మాట్లాడాడు. ఈ క్రమంలోనే కావాలనే ఆయన “స్పై” సినిమాను టార్గెట్ చేసి కొందరు రాజకీయ నేతలు ఈ సినిమాని ప్లాప్ చేశారు అన్న కామెంట్లు వినిపించాయి. మొత్తానికి ఏదో అనుకుని సినిమాలో నటించిన నిఖిల్ కి ఎంకేదో రిజల్ట్ చూపించారు జనాలు . అయితే కొంతమంది ఈ సినిమా బాగుంది అంటున్నప్పటికీ చాలామంది బాగాలేదు అన్న టాక్ ఎక్కువుగా వినిపిస్తుంది . చూడాలి మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?