సమంత ఎంత దురదృష్టవంతురాలు అంటే.. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలదా..!!

చాలామంది సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత అదృష్టవంతురాలు అని ..అందుకే ఆమెకు బడా బడా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని ..కూర్చున్న చోటే కోట్లు సంపాదించేస్తుందని ..ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అని చెప్పుకొస్తూ ఉంటారు . అయితే సమంత ఎంత దురదృష్టవంతురాలు అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన పని తాను చూసుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోలింగ్ జరిగినా.. ఎంత రచ్చ రంబోల సీన్స్ జరిగిన ఏమాత్రం పట్టించుకోకుండా.. ఉలకకుండా.. పలకకుండా తన పని తాను చూసుకుపోతున్న సమంతకి విడాకులు తీసుకున్న కొన్ని రోజులకే బంపర్ ఆఫర్ వచ్చిందట .

టాలీవుడ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చిన అమ్మడు తన మూర్ఖత్వంతో తన మొండితనంతో సినిమా రిజెక్ట్ చేసిందట. ఆ సినిమా మరేదో కాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుకె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా అనుకునింది సమంతనే అంటూ తెలుస్తుంది . అయితే అప్పటికే నాగచైతన్యతో విడిపోయిన బాధలో ఉన్న ఈ బ్యూటీ ఆ ప్రాజెక్టును సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ఆ ప్లేఅస్ లో దీపిక పదుకునేను తీసుకున్నారు. ఒకవేళ ఆ ప్రాజెక్టు కి సైన్ చేసి ఉంటే మాత్రం కచ్చితంగా ఆమె ఖాతాలో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం హిట్టు పడి ఉండదనే చెప్పాలి . దీంతో సమంత దురదృష్టవంతురాలు అంటూ ట్యాగ్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!