నందమూరి కుటుంబంలో గొడవలు పెట్టింది ఆ డైరెక్టరెనా..?

సినీ పరిశ్రమలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నప్పటికీ నటుడు, నిర్మాత ,బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. కమెడియన్గా నటుడుగా రాజకీయ నాయకుడిగా బండ్ల గణేష్ కు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. బండ్ల గణేష్ తాజాగా చేసిన ఒక ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ట్విట్ లో గురూజీ తండ్రి కొడుకులను విడదీశాడని బంగ్లా గణేష్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ ట్విట్ కు అర్థం బాలయ్య, ఎన్టీఆర్ లను త్రివిక్రమ్ విడదీశారా అని కొంతమంది నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

Nandamuri Kalyan Ram opens up on differences between Balakrishna and Jr NTR - IBTimes India
ముఖ్యంగా అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత బాలయ్య, ఎన్టీఆర్ మధ్య చాలా గ్యాప్ ఏర్పడిందని అభిమానులు భావిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత బాలయ్యకు దగ్గర కావడానికి ఎన్టీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. బండ్ల గణేష్ తన ట్విట్టులో భార్యాభర్తలను త్రివిక్రమ్ విడగొట్టారని చెప్పుకొచ్చారు.. దీంతో పవను అతని భార్యను విడగొట్టింది త్రివిక్రమేనా అంటూ సోషల్ మీడియాలో పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే త్రివిక్రమ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరనే విషయం తెలిసింది పవన్ ను తనను విడగొట్టింది కూడా త్రివిక్రమేనని బండ్ల గణేష్ చాలా ఫీల్ అవుతూ తెలియజేస్తూ ఉంటారు. దీంతో బంగ్లా గణేష్ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .నందమూరి కుటుంబంలో చీలికలు ఏర్పడడానికి త్రివిక్రమే కారణమా అంటూ పలువురు అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు.. మరి బండ్ల గణేష్ చేస్తున్న ట్విట్లకు త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. మరి గురూజీ అనే పదాన్ని ప్రతిసారి వాడడంతో బండ్ల గణేష్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.<

/p>