ఆ కారణంగా మూడేళ్లు కోర్టు చుట్టూ తిరిగిన SR. ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు వారికి తమకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చేలా చేసిన ఒక గొప్ప వ్యక్తి నటుడుగా, రాజకీయంగా ఆయన జీవితం అందరికీ కూడా ఆదర్శమని చెప్పవచ్చు. సినిమాలలో స్టార్ హీరోగా ఎన్నో రికార్డులను సైతం సృష్టించిన డబ్బు సంపాదించిన తనని ఇంతటి వారిని చేసిన ప్రజలను మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోలేదు. వారికి మంచి చేయాలని ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా కొనసాగారు.

Srimadvirat Veerabrahmendra Swamy Charitra (1984)

ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టారు నందమూరి తారక రామారావు గారు.. ఈ రోజున ఈయన పుట్టినరోజు సందర్భంగా NTR శతజయంతి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గత కొంతకాలంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

 

ఎన్నో చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఒకే సినిమాలో పలు పాత్రలు పోషించి దర్శకత్వం కూడా వహించి మంచి విజయాలను అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కెరియర్ల వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా ప్రత్యేకమని చెప్పవచ్చు. 1984లో ఈ సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గౌతమ బుద్ధ, వేమన, రామానుజ, ఆదిశంకరాచార్య, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వంటి పాత్రలు వేశారు ఈ సినిమాకు దర్శకుడు నిర్మాత ఎన్టీఆర్. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు విషయంలో ఒక సీన్ కోసం అభ్యంతరం తెలిపి దానిని కట్ చేయాలని చెప్పారట.అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోకపోవడంతో సెన్సార్ బోర్డు సినిమాకు క్లియరెన్స్ ఇవ్వలేదు.. దీంతో ఎన్టీఆర్ ఈ విషయంపై కోర్టు వరకు వెళ్లారు. అలా మూడేళ్లపాటు కోర్టులో ఈ సినిమాలో ఆ సీన్ ఉండాల్సిందే అని పోరాడి విజయాన్ని అందుకున్నారు.