టీడీపీలో విరాళాలపై చర్చ..సీట్ల కోసం నేతలు గేలం.!

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. నేతలు పోటీ పడి మరీ..విరాళాలు ఇచ్చారు. ఈ విరాళాలు టీడీపీకి బాగా ఉపయోగపడతాయని చెప్పాలి. పార్టీని నడిపించడానికి ప్లస్ అవుతాయి. అయితే ఎవరికి వారు తమ శక్తిగా తగినంతగా విరాళాలు ఇచ్చారు. కానీ ఊహించని విధంగా కొందరు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. ఇక వారు సీటు ఆశించి విరాళాలు ప్రకటించరనే చర్చ సాగుతుంది.

ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి కృష్ణా రెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు. జిల్లాలో హాట్ టాపిక్ అయ్యారు. జిల్లాలో చాలామంది నేతలు 2, 5 లక్షలు అన్నట్లు విరాళాలు ఇచ్చారు..కొందరు 10, 25 లక్షల వరకు ఇచ్చారు. కానీ కృష్ణారెడ్డి మాత్రం కోటి ఇచ్చారు. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈయన ఏమైనా సీటు ఆశించి ఈ స్థాయిలో విరాళం ఇచ్చారా? అనే చర్చ సాగుతుంది. కృష్ణారెడ్డిది కావలి నియోజకవర్గం. ఆ సీటు ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

అక్కడ టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు పార్టీకి 5 లక్షల విరాళం ఇచ్చారు. కానీ కృష్ణారెడ్డి కోటి ఇవ్వడంతో నియోజకవర్గంలో కొత్త  చర్చ మొదలైంది. ఆయన కావలి సీటు ఆశిస్తున్నారని ప్రచారం మొదలైంది. అదే సమయంలో ఉదయగిరిలో ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేశ్ సైతం 25 లక్షల వరకు విరాళం ఇచ్చారు. దీంతో ఆ సీటుపై సురేశ్ ఫోకస్ చేశారని తెలుస్తుంది. ఎప్పటినుంచో సురేశ్ ఉదయగిరి సీటుపై ఫోకస్ పెట్టి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

అయితే అక్కడ టి‌డి‌పి సీటు కోసం పలువురు పోటీ పడుతున్నారు. బొల్లినేని రామారావు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. చూడాలి మరి ఈ సీట్లు ఎవరికి దక్కుతాయో.