బాబా రామ్ దేవ్ వేషంలో ఉన్న ఈ స్టార్ హీరో ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫోటోలో అచ్చం బాబా రామ్ దేవ్ లా క‌నిపిస్తున్నది ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? కోలీవుడ్ లో అత‌నొక స్టార్ హీరో. టాలీవుడ్ లోనూ ఆ హీరోకు స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవ‌ల ఆ హీరోతో తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. మ‌రొక హింట్ ఏంటంటే.. కొద్ది రోజుల క్రిత‌మే స‌ద‌రు హీరో త‌న భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.. ఈపాటికే అత‌నెవ‌రో అర్థ‌మైపోయుంటుంది.

కోలీవుడ్ స్టార్ ధ‌నుష్‌. తాజాగా ఈయ‌న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. పొడవాటి జుట్టు.. గుబురు గడ్డం.. బ్లాక్ జాగర్స్ సన్ గ్లాసె స్ తో ధ‌నుష్ షాకింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. మొద‌ట చాలా మంది ధ‌నుష్ ను గుర్తుప‌ట్టలేదు. ఆఖ‌రికి అభిమానులు సైతం ధ‌నుష్ తాజా లుక్ చూసి మైండ్ బ్లాక్ అయింది.

ఇక అక్క‌డే ఉన్న కొంద‌రు కెమెరా మెన్స్ ధ‌నుష్ ఫోటోల‌ను క్లిక్ అనిపించారు. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాడంతో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. స‌డెన్ గా చూసి బాబా రామ్ దేవ్ అనుకుంటిమే అని కొంద‌రు అంటుంటే.. రామ్ దేవ్ బాబా బ‌యోపిక్ ఏమైనా తీస్తున్నావా ధ‌నుషా అంటూ మ‌రికొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ధ‌నుష్ ప్ర‌స్తుతం `కెప్టెన్ మిల్ల‌ర్‌` మూవీలో న‌టిస్తున్నాడు. ఈ మూవీ కోస‌మే ధ‌నుష్ అలా త‌యార‌య్యాడ‌ని తెలుస్తోంది.