బాబు వెనుక పవన్..వైసీపీపై ఎటాక్.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్..ఇద్దరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. పవన్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా పవన్ వర్షాల నష్టపోయిన రైతులని పరామర్శించడానికి రంగంలోకి దిగుతున్నారు. అయితే అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే.

సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కల్లాలు లోనే వడ్లు తడిచిపోవడం, మొలకలు రావడంతో రైతులు భారీగా నష్టపోయారు. అయితే రైతులకు అండగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి..పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఇక మరోసారి చంద్రబాబు రైతుల కోసం పోరు బాటపట్టారు. ఈ క్రమంలోనే ఈ నెల 12న తణుకులో రైతుల కోసం పాదయాత్ర చేయనున్నారు. అయితే బాబు వెనుకే పవన్ సైతం రైతులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఆయన కూడా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.

అది కూడా బాబు పర్యటించిన కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు.

ఇలా ఇద్దరు నేతలు రైతులకు అండగా నిలిచి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పటికే రైతుల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఈ సమయంలో బాబు, పవన్ పోరాటాలతో వైసీపీకి మరిన్ని చిక్కులు వచ్చేలా ఉన్నాయి. రైతుల మద్ధతుని తెచ్చుకునేలా ఉన్నారు.

Share post:

Latest