టిక్ టిక్.. దుర్గారావు ప్రతినెల ఎంత సంపాదిస్తారో తెలుసా..?

టిక్ టాక్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో దుర్గారావు అతని భార్య కూడా ఒకరు.వీరిద్దరూ వేసే స్టెప్పులు మంచి పాపులారిటీ సంపాదించాయి. దీంతో స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు దుర్గారావు. ఆమధ్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్లలో కూడా నటించారు. ఎప్పుడైతే టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యిందో కప్పట్నుంచి పాపులారిటీ తగ్గిపోయింది.. అయినప్పటికీ వీరు షేర్ చాట్, యూట్యూబ్ వంటి వాటిలో కనిపించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమా పాటలకు విరు వేసి డాన్స్ కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది.

కానీ వీరికి టిక్ టాక్ లో వచ్చినంత క్రేజ్ మాత్రం ఈ మధ్యకాలంలో రాలేదు.. తాజాగా దుర్గారావు కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అదేమిటంటే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతినెలా డాన్స్ కామెడీ, వీడియోల ద్వారా రూ.30 నుంచి రూ.40 వేల రూపాయల వరకు ఆదాయం వస్తున్నట్లుగా తెలుస్తోంది. అడపాదడపా కొన్ని షార్ట్ ఫిలిం లలో పాటు షోస్ కూడా చేస్తూ ఉండేవారు. అయితే కొన్నాళ్లపాటు హైదరాబాదులో నివసించిన దుర్గారావు ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో తన సొంత ఊరులో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Durga Rao (Tiktok Star) Age, Wife, Biography, Family, Video & More
దుర్గారావు సొంత ఊర్లో వ్యవసాయ పనులు చేసుకుంటూ మరొకపక్క డాన్స్ వీడియోలు చేసుకుంటూ తమ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తమ పిల్లల చదువుకు అయ్యే ఖర్చులను కూడా తామే సంపాదించుకుంటున్నామన్నట్లుగా తెలియజేశారు. ఇప్పటికీ వీరి వీడియోలు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం దుర్గారావు కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest