కారులో ఆ ఎమ్మెల్యేలకు చెక్..కేసీఆర్ ప్లాన్ ఇదే.!

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారం సొంతం చేసుకోవాలని కే‌సి‌ఆర్ చూస్తున్నారు. అధికారం సాధించే దిశగా వ్యూహాలు రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇచ్చే విషయంలో కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు అని కే‌సి‌ఆర్ ప్రకటించారు.

కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం జరగడం ఖాయం. ఎందుకంటే అందులో చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత ఉన్న వారికి సీట్లు ఇస్తే ఓటమి ఖాయం. ఆ విషయం కే‌సి‌ఆర్ కు కూడా తెలుసు. అందుకే సీట్ల పంపకాల విషయంలో కే‌సి‌ఆర్ ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎలా కాదు అనుకున్న కొంతమంది ఎమ్మెల్యేలని సైడ్ చేయడం మాత్రం ఖాయమని తెలుస్తుంది.

ఇప్పటికే పార్టీ పరంగా పలు సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల్లో కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని తెలుస్తుంది. ఇప్పటికే పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు కే‌సి‌ఆర్ ఎప్పటికప్పుడు క్లాస్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడేలోపు పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచిస్తున్నారు. అయినా సరే మారకపోతే ఆ ఎమ్మెల్యేలని పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు.

ఈ క్రమంలోనే దాదాపు 15 మంది ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా బాగోలేదని తెలుస్తుంది. వారికి ఇప్పటికే కే‌సి‌ఆర్ పిలిచి క్లాస్ ఇస్తున్నారట. ఇప్పటికీ మారకపోతే తీసి పక్కన పెట్టేస్తామని అంటున్నారట. మొత్తానికి కొంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు దక్కడం కష్టమని చెప్పవచ్చు.