విజయ శాంతిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయ… దీనికి కారణం ఆమే అంటూ!

విజయ శాంతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తెలుగు నటి, నిర్మాత, రాజకీయ నాయకురాలు అయినటువంటి ఆమె అందరికీ సుపరిచితమే. ఈమె తన 30 సంవత్సరాల సిని ప్రస్థానంలో ఎన్నో ఇండియన్ భాషా చిత్రాలలో వివిధ పాత్రలలో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలో ఆమె సుమారు 180 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాలతో పాటు భోజ్ పురి సినిమాలలో కూడా ఆమె నటించింది. ఆమెని తెలుగు ప్రేక్షకులు “ద లేడీ సూపర్ స్టార్”, “లేడీ అమితాబ్”గా ఇప్పటికీ పిలుచుకుంటూ వుంటారు.

ఆమె జీవితం ఓ తెరిచిన పుస్తకం. 1991లో ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని ఆమె అందుకుంది. అలా ఆమె 7 సార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, 6 సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని, 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని కూడా పొందింది. అంతేకాకుండా 4 రాష్ట్ర నంది పురస్కారాలను కూడా అందుకున్న ఘనత ఆమెదే. ఇక 1987లో ఆమె చిరంజీవి తో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనె తో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడ్డాయి.

ఇక అసలు విషయంలోకి వెళితే, తెలుగు సినీ రంగంలో గయ్యాళి పాత్రలంటే మొదటగా సూర్యకాంతం గుర్తొస్తుంది. ఆ తరువాతకాలంలో అలాంటి పాత్రలు చేస్తూ అంత పేరు సంపాదించింది వై విజయ. ఈమెకూడా తెలుగు, మళయాళ, తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించింది. ఆ తరువాత చిత్ర పరిశ్రమకు దూరమై, మళ్ళీ ఎఫ్ 2లో వై విజయ దర్శనం ఇచ్చింది. ఈమధ్య ఆమె ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ… సినిమాల్లో అవకాశాలు రానప్పుడు సహనటి విజయశాంతి ఇచ్చిన సలహాలే నాకు ఆధారం అయ్యాయి. ఆమె సలహామేరకు షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం వలన దానిపై వచ్చే రెంట్లు మా కుటుంబానికి ఆధారం అయ్యాయని చెప్పుకొచ్చింది.