ఏజెన్సీల్లో వైసీపీకి సెగలు..ఆ దెబ్బ గట్టిగా.!

ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి పట్టున్న విషయం తెలిసిందే. కీలకమైన ఎస్టీ స్థానాలని వైసీపీనే గెలుచుకుంటూ వస్తుంది. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉంటే..వాటినే వైసీపీనే గెలుచుకుంది. పోలవరం, రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, కురుపాం, పాలకొండ స్థానాలు ఎస్టీ రిజర్వడ్ గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలని వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఆయా స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో చెప్పవచ్చు.

అలాంటి పట్టున్న చోట్ల ఇప్పుడు వైసీపీ పట్టు కోల్పోయే పరిస్తితికి వచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత వైసీపీకి మైనస్ అవుతుంది. కానీ జగన్ ఇమేజ్ వల్ల కాస్త వైసీపీ బలంగానే కనిపిస్తుంది. అయితే ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏజెన్సీ ప్రజల ఆగ్రహానికి గురి అవుతుంది. బోయ, వాల్మీకులని ఎస్టీ జాబితాలో పెట్టేందుకు జగన్ ప్రభుత్వం అసెంలీలో బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే. దీన్ని కేంద్రానికి పంపారు. ఈ అంశం పట్ల బోయ, వాల్మీకిలు సంతోషంగానే ఉన్నారు.

అలాగే రాయలసీమలో ఎక్కువగా ఉన్న బోయ, వాల్మీకిలతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఆ అంశాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు.  జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికే రివర్స్ అవుతుంది. గిరిజనులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ఎక్కడకక్కడ ఎమ్మెల్యేలని అడ్డుకుంటున్నారు. బోయ, వాల్మీకిలని ఎస్టీ జాబితాలో చేర్చడంపై నిరసనలు చేస్తున్నారు.

అయితే ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి గట్టి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది.