ఏ హీరోయిన్ చేయ‌ని ప‌ని చేసిన అనుప‌మ‌.. అమ్మ‌డి టాలెంట్ కు అంతా షాక్‌!

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ పరంగా ప్ర‌స్తుతం మంచి జోరు మీద ఉంది. గ‌త ఏడాది కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయ‌గం.. ఆ త‌ర్వాత 18 పేజెస్‌, బ‌ట‌ర్ ఫ్లై చిత్రాల‌తో మ‌రో రెండు విజ‌యాల‌ను అందుకుంది.

ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ కొత్త అవ‌తారం ఎత్తింది. సినిమాటోగ్రాఫర్‌గా మారింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన `ఐ మిస్ యు` అనే షార్ట్ ఫిల్మ్‌తో డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ(DOP)గా మారి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. యూఎస్‌లో ఉంటున్న ఒక యువకుడికి ఇండియాలోని తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం చుట్టూ ఈ షార్ట్ ఫిలిం కథ తిరుగుతుంది.

ఈ షార్ట్ ఫిల్మ్‌ను చాయ్ బిస్కెట్ యూట్యూబ్ ఛానెల్‌లో తాజాగా స్ట్రీమింగ్ అయింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో అనుపమ కెమెరా వర్క్ కు అదిరిపోయే స్పంద‌న వ‌స్తోంది. ఇంకా చెప్పాలంటే అమ్మ‌డి టాలెంట్ కు అంతా షాకైపోతున్నారు. వరుసగా సినిమాలు, వరుస హిట్స్ తో బిజీగా ఉన్న హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం ఇంత వ‌ర్క్ జ‌ర‌గ‌లేదు. కానీ, అనుప‌మ ఏ హీరోయిన్ చేయ‌ని ప‌ని చేసి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక రికార్డును సృష్టించింది.

https://www.instagram.com/p/Cq2yTrcJobS/?utm_source=ig_web_copy_link